తెలంగాణా లో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎంతో డిస్కషన్ జరుగుతోంది. ఆ పదవి నాది నాది అని అందరూ పోటీ పడుతూ ఉన్నా కూడా కోమటి రెడ్డి వెంకట రెడ్డి లాంటి వారు ఆ పదవి ఇస్తే తెలంగాణా లో అధికారం కాంగ్రెస్ చేతిలో పెట్టేస్తాం అని ఎప్పుడో రాహుల్ కీ సోనియా కీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అయితే రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ గా కుంతియా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌, పీసీసీలో మార్పులు ఉండ‌వ‌నే సంకేతాలు ఇవ్వ‌డంతో నేత‌లు కొంత సైలెంట్ అయిపోయారు. 

ఇప్పుడు తాజాగా ఈ చర్చ మళ్ళీ మొదలైంది కానీ ఇప్పుడు వినిపించే పేరు, లాజిక్ కొత్తగా ఉన్నాయి. తెలంగాణా మహిళల ని సాకారం చేసుకోవడం కోసం ఒక మహిళా లీడర్ కి ఈ కిరీటం పెట్టాలనేది సోనియా - రాహుల్ ప్లాన్ గా చెబుతున్నారు.. కేసీఆర్ స‌ర్కారు హ‌యాంలో మ‌హిళ‌లా ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ప్రాధాన్య‌త లేద‌నే విమ‌ర్శ కూడా ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే.

సో… డీకే అరుణ‌కు ప‌ద‌వి ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పుకున్న‌ట్టూ అవుతుంద‌నీ, ఈ కోణం నుంచి తెరాస‌పై విమ‌ర్శ‌లు గుప్పించే ఆస్కార‌మూ ఉంటుంద‌నేది హైక‌మాండ్ వ్యూహంగా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: