రాబోయే 2019 ఎలక్షన్ లో మాత్రం హీరో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడు అనేది ఇంకా తెలకపోయినా అతను పోటీ చేసి తీరతాడు అనేది తెలిసిపోయిన విషయమే. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ శక్తిగా ఎదిగి 2014 లో టీడీపీ - బీజేపీ లకి సపోర్ట్ ఇచ్చాడు.

పవర్ స్టార్ జనసేన అనగానే అప్పట్లో అందరూ అత్యుత్సాహం చూపించినా మనోడు ఎక్కడా పోటీ చెయ్యలేదు. అయితే 2019 లో వ్యవహారం వేరేలా ఉండి తీరుతుంది. పవన్ అనేక చోట్ల పోటీ చేస్తాడు కానీ అది ఒంటరిగా మాత్రం కానే కాదు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలంటే టిడిపి బిజెపిలలో ఎవరు బెటర్‌ అనదే ఆ పార్టీవారిని వేధిస్తున్న ప్రశ్న.

పవర్‌ స్టార్‌కు మాత్రం ఈ దీనిపై క్లారిటీ వుందట. కాని దాన్ని ఎన్నికలకు మూడు మాసాల ముందు మాత్రమే బయిటపెడతానంటున్నారట. మరి అప్పటి వరకూ క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్నికల ఆశావహులు ఏమై పోవాలి? ఏమైనాసరే, నాకు అనవసరం అన్నది ఆయన సమాధానం.

మొత్తం మీద సరిగ్గా ఎన్నికల కి ఆఖరి రోజుల లేదా నెలల ముందర మాత్రమే పవన్ దీనికి సమాధానం చెప్తాడు తప్ప ముందుగానే ఎక్కడ ఓపెన్ అయ్యే ఉద్దేశ్యం లేదు అంటున్నారు. ఆఖరు ఘట్టంలో అనివార్యత పేరిట అదే చేస్తారా లేక స్వంత ఉనికి నిలబెట్టుకుంటారా అన్నది పవన్‌ ముందున్న పెద్ద ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: