కేసీఆర్ సర్కార్ గిరిజనులపై ఎప్పుడూ లేని ప్రేమ చూపిస్తున్నారు . ఈ మధ్య  అనేక కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి కోసం వాళ్ల మీద  కపట  ప్రేమ కనబరుస్తున్నారు. ST ల సంక్షేమం గురించి ప్రగతిభవన్లో వారి సమస్యల కి సంభందించి  అనేక సమీక్షలు అధికారులతో చర్చిస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టలేని గిరిజన కుటుంబాల గురించి ఉరట ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. వారి  బిల్లులు  మఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయంపై ఆధారపడ్డ గిరిజన కుటుంబాలకు భూ పట్టాలు ఇవ్వడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి రూపంలో 8 రూవేలు ఇస్తారట. పశువుల పై ఆధారపడ్డ కుటుంబాలకు పశువుల పెంచుకోవడానికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తామని ప్రకటించారు. గిరిజన జీవితాల్లో మార్పు కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఎందుకంటే కాంగ్రెస్ ఈ మధ్య గిరిజనుల ఆదివాసుల మీద దృష్టి పెట్టింది.

కాంగ్రెస్ అధ్యక్షా పదవి చేపట్టాక రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రాన్నికి వస్తారని,  ముందుగా ఆదివాసుల, గిరిజనుల మధ్య సభలు నిర్వహిస్తారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ వారంలోనే రాహుల్ గాంధీ పర్యటన ఉండాల్సింది, కానీ గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ST లు అయిన గిరిజనులు ఆదివాసులు నిరుపేదల సమస్యలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఆ ప్రయత్నం కాంగ్రెస్ చేయక  ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో గిరిజనులు 30 లక్షల మంది ఉన్నారని లెక్కలు చెప్పారు. ఓట్ల కోసం కాకుండా వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని చెపుకోచ్చారు. రాష్ట్ర సంకల్పాన్ని ఆదివాసులు గుర్తించాలని ముఖ్యమంత్రి కోరారు. గిరిజనులతో కలిసి మెలిసి ఉండాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. దీన్నిబట్టి గిరిజనుల మీద కేసీఆర్ సర్కారీకి  అంత ప్రేమ ఎందుకొచ్చిందో చెప్పనక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: