టిడిపి పార్టీలో నాయకుల తీరు  పరిస్థితులు బట్టి మారిపోతుంది. పార్టీలో తమకు సరైన గౌరవం  ఇవ్వకపోయినా వారి రాజకీయ భవిష్యత్ గురించి, వారి ఉనికి చాటుకోవడం కోసం లేదా తమ బలాన్ని చూపించడం ఏదో ఒకటి  చేస్తుంటారు. ఆమధ్య రాయలసీమ  ప్రాంతానికి చెందిన అనంతపురం ఎంపీ  జేసి దివాకర్ రెడ్డి కూడా ఇలాగే  చేశారు.


రాజీనామా చేస్తున్నానని  బెదిరించి తన అవసరాలను నెరవేర్చుకుని తెలుగుదేశంలో తనకు పట్టు గట్టిగా ఉందని  ప్రదర్శించే ప్రయత్నం చేశారు.ఇదే కోవలో టిడిపి పార్టీకి చెందిన మరో నాయకుడు అయిన రావెల కిషోర్ బాబు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పార్టీలో తనకు దక్కాల్సిన ఇవాల్సిన గౌరవం ఇవ్వటం  లేదని పార్టీ కూడా తనను సరిగా గుర్తించలేదని తన ప్రయత్నాలు చేసి జేసీ కోవలో   వెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గత ఎన్నికల్లో తెరమీదకి వచ్చిన కిషోర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు,కేంద్ర సర్వీస్ లో   చేసిన అనుభవం వుంది అని ఆయనకి పార్టీ మంత్రిపదవి ఇచ్చింది.


అక్కడ నుండి  ఆయనలో మార్పు వచ్చింది, రాజకీయ గ్రూపులను ప్రోత్సహించడం ఇతర పార్టీ నేతలకు  మద్దతు పలకడం వంటి ఆరోపణలు టీడీపీ  అధిష్టానానికి అందాయి. దీంతో కిషోర్ బాబు.. మంత్రి పదవి పోయింది. పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమాల్లో కూడా రావెల చురుగ్గా  పాల్గొనకుండా ఉన్నారు. కానీ  ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం  MRPS  నాయకులకు సహాయం చేస్తున్నట్లు ఆరోపణలు  వినిపిస్తున్నాయి. మంద కృష్ణ మాదిగ నిర్వహించే సభలను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుంటే మరో ప్రక్క కిషోర్ బాబు  మంద కృష్ణ  మాదిగకు ఆశ్రయం కనిపిస్తున్నారట. ఎమ్మార్పీఎస్ భవిష్యత్ కార్యాచరణలో కూడా కిషోర్ బాబు చురుగ్గా పాల్గొంటున్నారని టిడిపి అధిష్ఠాననికి  అందిన సమాచారం.



ప్రస్తుతం టీడీపీ  లో ఈ విషయం  చర్చనీయాంశంగా మారింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని టిడిపి నాయకులు గుర్రుమంటున్నారు. అయితే, జేసీ విష‌యంలో ఈ వ్యూహం ప‌నిచేసిందేమోగానీ, రావెల‌కు వ‌ర్కౌట్ అయ్యే ప‌రిస్థితులు పెద్ద‌గా లేవు. ఎందుకంటే, జేసీ అవ‌స‌రం పార్టీకి చాలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: