ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామని అప్పటివరకూ ఎటువంటి చర్చ ఉండదని తెలుగుదేశం నాయకులు చెబుతుంటారు. ఈలోగా పోత్తులకు సంబంధించి బాధ్యతలను ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా లో ఫేమస్ ఛానల్ - పేపెర్ ఉన్న మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి తీసుక్కునట్లు అనిపిస్తుంది.


ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో  అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిన అవసరముందని బీజేపీకి పత్రిక ద్వారా  ఉద్బోధించారు చాలా మంది . అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే  బీజేపీకి  లాభమని అంతేకాకుండా రాష్ట్రంలో ఆ పార్టీ బలపడుతుందని  విశ్లేషించారు ఈ పేపర్ వారు . ఈ వారం కొత్తగా మరొక వ్యాసం రాసారు అదేంటంటే ..  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పొత్తుల గురించి పాటలు ఉపదేశిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల టిడిపికి బీజేపీకి మధ్య దూరం పెరుగుతున్నట్లుగా అభివర్ణిస్తున్నారు.


పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో సాయం చేయకపోతే ఆ ప్రభావం టిడిపి బిజెపి కూటమి మీద ఉంటుందని చెప్పారు. మోడీ గాలి  కూడా దేశంలో తగ్గిందని  చెప్పారు. జనసేన పార్టీ వచ్చేఎన్నికలలో ఎవరితో  పొత్తు పెట్టుకుంటే బాగుంటుందో కూడా చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై  బిజెపికి జనసేన అధ్యక్షుడు వ్యతిరేకంగా ఎప్పుడో తన గళాన్ని విప్పారు. దీనిబట్టి జనసేన బిజెపితో జనసేన పొత్తు ఉండదని చెప్పారు. ఇక ఏపీలో  మిగిలిన పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మీద ఉన్న కేసులు, ప్రతి శుక్రవారం  విచారణకు కోర్టుకు  హాజరవటం ఇటువంటి పరిస్థితులలో వైసీపీతో జనసేన కలిస్తే పవన్ ఇమేజ్ పోతుందని రాశారు.



రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాజ‌పా, టీడీపీలు తెగ‌తెంపులు చేసుకుంటున్నాయ‌ని కూడా తెగేసి చెప్ప‌లేదు. భాజపాతో పొత్తు విషయమై టీడీపీ ఆలోచన ఏంటనేది కూడా గోడ మీది పిల్లివాటంగానే చెప్పారు. ‘ఎవ‌రికి ఎప్పుడు ఏది ప్ర‌యోజ‌నం అనుకుంటే అదే చేస్తారు’ అంటూ ఓ వాక్యం రాసేసి ఎస్కేప్ అయిపోయారు. సో… జ‌న‌సేన‌కు టీడీపీతో మాత్రమే పొత్తు వేరే దారి లేద‌న్న‌ట్టుగా చెప్పారు.



ఇక్కడ అసలు విషయం  ప్రస్తావించకపోవడం  ఆశ్చర్యం,  అదేంటంటే రాబోయే ఎన్నికల్లో జనసేన అన్నిచోట్ల పోటీ చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఇటువంటివి విషయాలు విశ్లేశించనేలేదు. దీన్నిబట్టి  ఆంధ్రజ్యోతి పత్రిక  జనసేన పార్టీ పొత్తు లేకుండా ఎన్నికలలో  పోటీ చేయలేదని వేరే డిసైడ్  చేస్తున్నారు. ఒకవేళ  పొత్తు పెట్టుకోవాలి అనుకొంటే టిడిపి తో మాత్రమే పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉందని డిసైడ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: