ప్రతి చిన్న విష్యయాన్ని ప్రచారం చేసుకొని లబ్ధి పొందటమెలాగో మన రాజకీయనాయకులకు బాగా తెలుసు. నిజంగా ప్రజా సేవ చేసి లబ్ధి పొందాలంటే సమయం పడు తుంది. అడ్డాదారిలో ఆ లబ్ధి లభించాలంటే - ఎలా ప్రచారం చేసుకోవాలో బాగా తెలియాలి.  ఏ విషయమైనా ప్రచారం ద్వారా లబ్ధి పొందటం తెలిసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా "ఏపీ అగ్రిటెక్ సదస్సు-2017" కు విశ్వ విఖ్యాత ఐటి వ్యాపారవేత్త,  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ రాక సందర్భం గా చేసిన హడా వుడి నింగిని అంటింది. 
milinda gates foundation in the service of humanity కోసం చిత్ర ఫలితం

"మిలిండా-గేట్స్ ఫౌండేషన్"  పనుల్లో బిజీగా ఉంటున్న బిల్ గేట్స్ ఇండియా అంటే  మంచి అభిప్రాయం ఉంది అందుకే మన దేశం అంటే బాగా శ్రద్ద చూపిస్తారు. తరచూ ఇండియా వస్తున్నారు. ఈ క్రమం లోనే ఆయన ఇండియా పర్యటన మరియు పనిలో పనిగా విశాఖ "ఏపీ అగ్రిటెక్ సదస్సు-2017" సదస్సుకు చంద్రబాబు ప్రత్యేకించి స్వాగతం పలకటంతో వచ్చారు. బిల్ గేట్స్ కోసం ఎయిర్ పోర్టు వరకు వెళ్లి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి బృందం. ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు చంద్రబాబు వరుస ట్వీట్లతో ట్విట్టెర్ ను కుదిపేశేలాగా హోరెత్తించారు. ఎప్పుడేం జరుగుతోందో "లైవ్ అప్ డేట్స్" తో ట్విట్టెర్ దద్దరిల్లి పోయింది. బాబుగారు ఇంతగా రాసి పూసుకున్నా కానీ... బిల్ గేట్స్ ట్విటర్ అకౌంట్లో మాత్రం ఈ పర్యటన గురించి ఒక్క ట్వీట్ కూడా రాలేదు.

milinda gates foundation in the service of humanity కోసం చిత్ర ఫలితం

    
"థాంక్యూ మై ఫ్రెండ్ బిల్ గేట్స్! " అంటూ సంబోధిస్తూ ట్వీట్లతో చంద్రబాబు వరదై ప్రవహించినా బిల్ గేట్స్ నుంచి మాత్రం ఈ కార్యక్రమం గురించి కానీ, ఫ్రెండ్ చంద్ర బాబు గురించి కానీ, ఆంధ్ర ప్రదేశ్ గురించి కానీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. పైగా చంద్రబాబు ట్వీట్లలో "గేట్స్ ను ట్యాగ్"  చేసినా కూడా బిల్ గేట్స్ ట్విటర్ పేజీలో వాటిని రీట్వీట్ చేయలేదు. 

ap agri tech meet 2017 bill gates & babu కోసం చిత్ర ఫలితం    

దీంతో చంద్రబాబును విమర్శించేవారంతా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కొద్దిరోజుల కిందట బిల్ గేట్స్ ఉత్తర ప్రదేశ్ లో పర్యటించడం, ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి  యోగి ఆదిత్యనాధ్ ని కలిసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా యోగి ఏమీ అత్యుత్సాహం చూపించలేదని, బిల్ గేట్స్ కోసం ఎయిర్ పోర్టు వరకు ఎదురెళ్ళలేదని తెలుస్తుంది. మరి చంద్రబాబు మరీ ఇంత అత్యుత్సాహం చూపించి అభాసుపాలయ్యారేమో! నని ట్విట్టెర్లో ట్వీటర్స్ తెగ సెటైర్లు వేస్తున్నారు.


దాదాపుగా బిల్ గేట్స్ ఒక యోగీశ్వరునిలాగా మారి తమ ఫౌండేషన్ ద్వారా విశ్వవ్యాప్తసేవలు కొనసాగిస్తున్నారు. ఒక వానప్రస్థ వాసికి ఈ హడావిడి ఆర్భాటం నచ్చవు. ఇంకే దైనా ప్రతిఫలం ఆశించని పనులుంటే ఆయనతో చేయించుకోవచ్చు. అదీ ఆర్తు లకు వారివృద్దికి చేయూతనిచ్చేదై ఉండాలి కాని ఈ చెత్తరాజకీయ ప్రయోజనాలకు మాత్రం  కాదు.   బిల్ గేట్స్ సేవా భావంతో గంభీరంగా పనిచేస్తారు. చంద్ర బాబు గారు ప్రచారార్భాటంతో అంతా గందరగోళం చేస్తారు. ఈ  ఇద్దరూ "వ్యక్తులుగా తూర్పూ-పడమర" లే ఎప్పటికీ కలవరు. 

ap agri tech meet 2017 bill gates & babu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: