ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. పురుషులను చంపేయడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీలను అమలు చేస్తోందని విమర్శించారు.  సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి.. ఇష్టారీతిన జీవోలను అమలుచేస్తున్నారని మండిపడ్డారు.  ఏపీ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యమే అని అందరి చెవిలో పువ్వు పెడుతూ..ప్రధాన రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇష్టారీతిన వైన్ షాపులకు అనుమతి ఇచ్చారని అన్నారు. 
జగనన్న మాట.. రాజన్న మాట
ఇక మద్యానికి బానిసైన వారు తమ ఆదాయంలో సగభాగం ఈ మద్యానికే వెచ్చిస్తున్నారని..ఆడవాళ్ల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, ప్రజలు ఆయనకు బుద్ది చెప్పాలని సూచించారు.  రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం జరిగి తీరుతుందన్నారు.
ఆ ఘనత చంద్రబాబుదే:
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. జగనన్న సీఎం అయితేనే ఆడవాళ్ల కష్టాలు తీరుతాయని, జగనన్న మాటిస్తే రాజన్న మాటిచ్చినట్టేనని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: