ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ప్రజల తమ సంపాదనలో అత్యధికం వైద్యం కోసం ఖర్చు చేసే రోజులొచ్చాయి. రాను రాను ఈ రంగంలో ప్రభుత్వం పాత్ర తగ్గిపోతోంది. ఇలాంటి సమయంలో ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలని తపిస్తోంది.  అందుకే అత్యధిక జనాభా ప్రభావితమయ్యే రక్తపోటు, మధుమేహం,  స్థూలకాయం, రక్తహీనతపై నిరంతర పోరాటం చేయాలని నిశ్చయించింది. ఈ నాలుగు రోగాలపై ఏడాదంతా విస్తృత ప్రచారం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.అవగాహన లోపం కారణంగా ఈ వ్యాధులు ప్రజల ప్రాణాలను కబళిస్తున్నాయి ఏపీ వైద్య నిపుణులు చెబుతున్నారు.

Image result for dayabits fat

రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, రక్తహీనత.. ఈ నాలుగు వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 63 శాతం ఉన్నాయి. ఏటా 57 మిలియన్ల మంది వీటి వల్ల మృతి చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాస్థాయిల్లో నిర్వహించిన ఆరోగ్య సర్వేలో... ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. 60 శాతం మందికి స్థూలకాయం ఉన్నట్లు గుర్తించారు. 29శాతం మందికి శారీరక వ్యాయామం లేదని తేల్చారు.  61 శాతం మందికి స్వల్పస్థాయిలో రక్తహీనత, 8.4 శాతం మందికి తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 8.2 శాతం మందికి తీవ్రస్థాయిలోమధుమేహం, 5 శాతం మందికి అతి తీవ్రస్థాయిలో ఈ వ్యాధి ఉన్నట్లు సర్వేలో కనుగొన్నారు. 9 శాతం మందికి తీవ్రస్థాయిలో... 3.5శాతం మందికి అతి తీవ్రస్థాయిలో రక్తపోటున్నట్లు నిర్థారించారు.

Image result for dayabits fat

ఎన్టీఆర్ వైద్యసేవ కేసుల్లో.. ఈ నాలుగు వ్యాధుల ఖర్చే సగానికి చేరిందట. అందుకే ఈ రోగాల లక్షణాలు, అనర్థాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడటంతోపాటు కోట్లాది రూపాయల ప్రజలధనం వృథా కాకుండా ముందుగానే వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం బావిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు, డ్రగ్ కంట్రోల్ పరిపాలన విభాగం సమన్వయంతో ప్రభుత్వం ఆడియో, వీడియో సీడీలను విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: