తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని చంపుకుని తమ అధినేత సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని  హుందాగా చెప్పుకొంటారు.రాబోయే ఎన్నికలు నాయకుల మధ్య ఉన్నా విమర్శలను పక్కనపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని  కాంగ్రెస్ నాయకులు వ్యూహాలు  సిద్ధం చేస్తున్నారు.


రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ నాయకులను పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ . అధికార పార్టీ నుండి  కూడా వలసలు ప్రోత్సహిస్తే మరింత గెలుపుకు ప్రయత్నంగా  పార్టీ బలంగా ఉందని ప్రచారం చేసుకోవచ్చని కథనాలు కూడా  వెలువడుతున్నాయి. బలం  అనేది క్షేత్రస్థాయి నాయకుల్లో ఉంటే సరిపోతుందా ?...నాయకుల మధ్య ఉన్న లోటుపాట్లను అసంతృప్తులను  పక్కన పెట్టేశాం అని  చెప్పుకున్నంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని భావిస్తే సరిపోతుందా..? క్షేత్రస్థాయి నాయకులంతా హైదరాబాద్ లో  ఉంటే లోకల్ నాయకుల పరిస్థితి ఏంటి?..  స్వర్గీయ ఇందిరాగాంధీ శతజయంతి   వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ  నిర్వహించిన అనేక కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడ్డాయి.



అదిలాబాద్ లో  జరిగిన ఇందిరాగాంధీ శతజయంతి కార్యక్రమానికి హాజరైన పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు,మాజీమంత్రి రామచంద్రారెడ్డి మరియు పీసీసీ కార్యదర్శి సుజాత వర్గాలకు  చెందిన కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు ముందు గొడవకు దిగడంతో, ఆయన సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే గొడవ  సర్డుకోకపోవడంతో హనుమంతురావు సహనం కోల్పోయి కార్యక్రమం మధ్యలో  వెళ్లిపోయారు. ఇదేగాక మంచిర్యాలలో ప్రోటోకాల్ గొడవ, బెల్లంపల్లిలో స్థానిక నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి, పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఇలా అనేక మండల  కార్యక్రమాల్లో కూడా పార్టీలో ఉన్న నాయకుల మధ్య  విభేదాలు బయటపడ్డాయి. ఇటువంటి ఘటనలు తమ దృష్టి దాకా వచ్చాయని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు .



హైద‌రాబాద్ లో కూర్చుకుని హైక‌మాండ్ కు నివేదిక‌లు పంపించే నాయ‌కులు ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన అంశం ఇదే! క్షేత్ర‌స్థాయిలో చాలా అసంతృప్తులున్నాయి.పై స్థాయిలో నాయకుల మధ్య ఉన్న కలుపుగోలుతనం కింది స్థాయిలో ఉంటే బాగుండేది. స్వర్గీయ ఇందిరా గాంది శతజయంతి కార్యక్రమాలలో బయటపడ్డ స్థానిక నేతల మధ్య ఉన్న  గొడవలను పై  స్థాయి నాయకులు  ఏ విధంగా సర్దిచెప్తారో ? గొప్పగా తెలంగాణా లో ఎదగబోతున్నాం అంటున్న కాంగ్రెస్ ని చూసి నవ్వుతున్నారు ఇప్పుడు జనాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: