టాలీవుడ్‌లో నంది అవార్డులు ప్రకటన నుండి ప్రజ్వరిల్లిన అగ్నిజ్వాలలు రోజురోజుకి రగుల్తూనే ఉన్నాయి. నిప్పు సెగ అంత కంతకూ పెరుగుతూ,  ఈరోజు అసెంబ్లీని తాకింది. ప్రభుత్వం అవార్డుల ప్రకటనను సమర్థించుకున్నా, నంది అవార్డుల పై వస్తున్న విమర్శల వాడివేడితో పదునెక్కుతూనే ఉంది. కావలసినంత అపఖ్యాతి ప్రభుత్వం సంపాదించు కుంటూనే ఉంది. ఈ జ్వాలలు రగిల్చిన వేడి మాత్రం తగ్గడం లేదు.

30 years industry prudvi comments on nandi awards కోసం చిత్ర ఫలితం

తాజాగా ప్రముఖ కమెడియన్ “థర్టీ ఇయర్స్ ఇండస్ట్రి -పృథ్వీ”  నంది అవార్డుల ప్రకటనపై నవ్వుతూనే చలోక్తులతోనే పదు నైన విమర్శలవర్షం కురిపించారు.  నంది అవార్డులపైన.. అవార్డులు ప్రకటించిన వారి పైన తనదైన శైలిలో సెటైర్‌లు వేశారు.  ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృద్వీ ఏమన్నారంటే:


నమస్కారం నందులు!  అంటూ ఇంటర్వ్యూ  ప్రారంభించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రి- పృథ్వీ తనకు నంది అవార్డ్ రాకపోవడం చాలా బాధకలిగించన్నారు. అయితే తనకు అన్యాయం జరగడం ఇది తొలిసారి కాదని. ఖడ్గం సినిమా అప్పుడే తనను అణగ ద్రొక్కారని,  నాకు జ్యూరీ అవార్డుల కమిటీ మెంబర్ ఫోన్ చేసి అవార్డువచ్చిందని చెప్పారని తీరా అవార్డులు ప్రకటించే సమయానికి  కొన్ని సర్ధుబాట్ల కారణం గా మీకు అవార్డ్ యివ్వటం  కుదరలేదని చెప్పడంతో “షాక్‌” కి గురయ్యాన్నారు. 

30 years industry prudvi comments on nandi awards కోసం చిత్ర ఫలితం

అయితే నందులు తమకు ఎందుకు రాలేదంటే,  ఏవో కొలమానాలు ఉన్నాయంటూ తప్పించుకునే కారణాలు చెబుతున్నారనీ అవేవీ నమ్మశక్యంగా లేవన్నారు. హర్రర్ మూవీలకు అవార్డులు లేవంటూనే అంజలికి ఉత్తమ నటి ఎలా ఇచ్చారు?

 డబ్బింగ్ చిత్రాలకు అవార్డు ఇవ్వమంటున్న జ్యూరీ మెంబర్స్ అప్పట్లో దాసరికి ఉత్తమ నటుడు ఎలా ఇచ్చారన్నారు. బావ బావమరిది డబ్బింగ్ సినిమానే, మామగారు రీమేక్ చిత్రమే.., మేస్త్రి  సినిమా అరువు తెచ్చుకున్నదే.  ఆ సినిమాకు దాసరికి ఉత్తమ నటుడు ఇవ్వలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

30 years industry prudvi comments on nandi awards కోసం చిత్ర ఫలితం
ఇక అక్కినేని నటించిన ‘మనం’ సినిమాకి అవార్డులు రాకపోవడం దారుణం అని, ఇక మెగా ఫ్యామిలీకి అవార్డు రాకపోవడంపై స్పందిస్తూ,  ఆ ఫ్యామిలీకి నందులు కొత్త కాదని ఇప్పటి వరకూ వచ్చిన నందులే ఇంటి నిండా ఉన్నాయన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జాతీయ అవార్డ్‌ను కమల్ హాసన్‌కు ప్రకటించడంపై కూడా ఫైర్ అయ్యారు పృథ్వి.  ఆయనకు అసలు ఎన్టీఆర్ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. అలాంటి నటులు మన తెలుగులో లేరా? అని ప్రశ్నించారు. కైకాల సత్యనారాయణ లాంటి దిగ్గజాలు మన తెలుగు లోనే ఉన్నారన్నారు.

ఇక నంది అవార్డ్ వచ్చినంత మాత్రాన నెత్తిపై కిరీటం ఏమీ రాదని కాకపోతే అదో టానిక్‌లా పనిచేస్తుందని.. అందుకే పెద్ద నందిని చేయించుకుని గుర్తుగా పెట్టుకుంటా, దానిపై నేను చేసిన  ‘లౌఖ్యం’ చిత్రానికి నంది రాలేదని రాసి పెట్టుకుంటా అన్నారు. అప్పుడైనా మనలో ఫైర్ పెరుగుతుందంటూ వ్యంగ్య కామెంట్స్ చేశారు.


ఇక నేను ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నాపై రకరకాల కామెంట్స్ చేస్తుంటారని. ఒకడు తుచ్చ అంటాడు, ఇంకొకడు లుచ్చా అంటాడు. సభ్యతా సంస్కారం లేని చెత్త వెదవలు చేసే కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు.


అయినా.   “కొనుక్కున్న నందులు మనవైపు సూటిగా  అదో లాగా వెరైటీగా చూస్తూ ఉంటాయని - ఆ తరవాత వాటిని చూస్తూ అంతరాత్మలో చచ్చిపోతామని” కోటా శ్రీనివాస రావు గారు అనేవారని తాజా నందుల ప్రకటన చూస్తే  “ఏదో తేడా” కొడుతున్నట్లుందని అన్నారు.  అయినా నటనకు నంది కొలమానం మాత్రం  కాదు. ప్రజలచేత ఎన్ను కున్న ప్రభువులిచ్చే పురస్కారం కాబట్టి నందిని పొందాలను కోవటం తప్పుకాదన్నారు. రానున్న కాలంలో మహానందులు ప్రజాభిమానం నుండి పుట్టుకొస్తూ నా దరి చేర తాయ ని ఆశాభావాన్ని వెలిబుచ్చారు.  తనను అభిమానించే ప్రేక్షకులు తనకు "మెసేజ్‌లు"  పంపు తున్నారన్నారు.

 

ఇండస్ట్రీ తనకు తిండి పెడుతుందని అలాంటి ఇండస్ట్రీ గురించి నాలుగు మాటలు మాట్లాడితే తప్పేంటన్నా రాయన. ఇక ఫైనల్‌గా నందులకు నమస్కారం అంటూ అవార్డులు అందుకుంటున్న నటులకు  శుభాకాంక్షలు తెలియజేశారు.

30 years industry prudvi comments on nandi awards కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: