ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా ప్రజా సంకల్ప  పాదయాత్రలో నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ మంత్రులు విమర్శించారు. వివిధ సందర్భాల్లో  మాట్లాడిన  మంత్రులు ఆయనపై మండిపడ్డారు. మంత్రి ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్  ఇస్తున్నా హామీలు  నెరవేర్చాలంటే నాలుగు రాష్ట్రాల బడ్జెట్ కావాలని వెటకారం చేశారు.

ప్రతిపక్షనాయకుడు పాదయాత్ర రోడ్డు కి పరిమితమని, టిడిపి పార్టీ ఇంటింటికి వారి సమస్యలు తెలుసుకుంది అన్నారు. మంత్రి ప్రతిపాటి  పుల్లారావు  మాట్లాడుతూ జగన్ ఇక గెలవలేరని తెలిసి ఎవరు అమలు చేయలేని హామీలు ఇస్తున్నాడు అని  మాటల తూటాల వర్షం కురిపించారు, జనం కూడా ఆయన మాటలని నమ్మడం లేదన్నారు. అధికార దాహం కోసం హామీలు  ప్రకటిస్తున్న వైసీపీకి కాంగ్రెస్ పార్టీ  కి పట్టిన గతి పడుతుంది అని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జోస్యం చెప్పారు. జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రలో పది రోజులకి రూ. 1.50 లక్షల కోట్ల విలువైన హామీలు ఇచ్చారని లెక్కతేల్చారు.

ఏది ఎలాగున్నా జగన్  చేస్తున్న పాదయాత్రకి  తొలిసారి  కౌంటర్ ఇచ్చే పనిలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేత ఇస్తున్న హామీలను గురించి విమర్శించడం చూస్తుంటే జగన్  ఇస్తున్న హామీలకు అధికార పార్టీ తప్పనిసరిగా ప్రతిస్పందించల్సిన సమయం వచ్చింది అని  అనుకున్నట్టు ఉంది. కానీ ఇక్కడ తెలుగుదేశం నేతలు లాజిక్ మిస్ అవుతున్నారు. లక్షన్నర కోట్ల హామీలు ఇచ్చినా రెండు లక్షల కోట్ల హామీలు ఇచ్చినా జనానికి అవి చేరేలా ఎలా తీసుకుని వెళతాం? బడ్జెట్ రూపకల్పన ఏంటి అనేవి జగన్ మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పబోతున్నారు.

త్వరలో దీనికి సంబంధించి వైకాపా సరైన బడ్జెట్ తీరు చూపించ బోతోంది. నిజంగా టీడీపీ వారు చెబుతున్నట్టు అక్కడ లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యే హామీలు లేవు అనేది వైకాపా వాదన. ఎక్కువ మొత్తం లో ఖర్చు అయ్యే హామీలు అనేమాట నిజమే కానీ దానికి తగ్గట్టుగా జగన్ బడ్జెట్ రూపకల్పన, మిగులు బడ్జెట్ లాంటి అంశాల మీద ఇప్పటికే చర్చిస్తున్నారు అనీ తమ వైకాపా నాయకుల ద్వారా ఈ హామీల అమలు ఎంతవరకూ సాధ్యం అనేది చెబుతారు అని తెలుస్తోంది.

టీడీపీ గుర్తు పెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, గత ఎన్నికల టైం నుంచే జగన్ ఎప్పుడూ ఇవ్వలేని హామీలు ఇవ్వను అని చెబుతూ వస్తున్నారు. అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చి ఇప్పుడు రైతుల కొంప ముంచింది ఏ ప్రభుత్వమో, టీడీపీ నాయకులే అర్ధం చేసుకోవాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: