తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది.  మరోవైపు నగరంలో నేర సామ్రాజ్యం పెరిగిపోతుంది.  ఇప్పటికే హత్యలు, సెటిల్ మెంట్స్, హైటెక్ వ్యభిచారాలు, గన్ కల్చర్ కూడా పెరిగిపోతుంది. ఆ మద్య డ్రగ్స్ కలకం సృష్టించిన విషయం తెలిసిందే. 
Image result for trs leader vallabhaneni srinivas murder
ఈ నెల 16న సనత్ నగర్ బస్టాండు వద్ద హత్యకు గురైన టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాస్ హత్య మిస్టరీ వీడింది.  హత్య తర్వాత నింధితులు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు.  ఈ నేపథ్యంలో వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుడు షాజిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

అయితే హత్యకు కారణం పాత కక్ష్యలే అని తేలింది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: