ఒక సమస్య నుండి ప్రజల దృష్టిని మాల్చడానికి ప్రభుత్వాలు కొత్త విషయాన్ని తెరమీదకు తీసుకు వస్తాయి. ప్రభుత్వ పొరపాట్లు  జరిగినప్పుడు  చాలామంది పాలకులు ఇటువంటి ప్రణాళికలను అమలు చేస్తారు. సరిగ్గా ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  దగ్గర జరిగిన భోటు ఘటనలో,  బోటు ప్రమాదం లో 23 మంది మరణించారు, ఇంకెందరో గాయాలపాలు కూడా అయ్యారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మిస్తున్న  చోటా ఇలా జరగడం దురదృష్టకరం. ఈ ఘటనపై మీడియా కూడా ఘాటుగానే స్పందించింది.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేశాక, అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన సంఘటన ఇది.. ఇటువంటి సమయంలో సరిగ్గా…... నంది అవార్డుల ప్రధానోత్సవం మొదలైంది…. పడవ ఘటన నంది రగిల్చిన మంటల్లో కొట్టుకుపోయింది.

సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ నంది గొలే. విచిత్రంగా ఎన్నడూ లేని విధంగా జ్యూరీ సభ్యులు సైతం ప్రత్యక్ష చర్చల్లోకి దిగిపోయి, ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నారు.

నిజానికి ప్రభుత్వం  తల్చుకుంటే ఈ నంది  మంటలను ఆపవచ్చు. అలా చేయక పోగా కనీసం తాను నియమించిన జ్యూరీ సభ్యులను కూడా నియత్రించలేదు.దీని బట్టి చూస్తే పడవ ప్రమాదాన్ని ప్రక్కకు  పెట్టడంతోపాటు అటు  ప్రతిపక్ష నేత చేస్తున్న పాదయాత్రకు కూడా ప్రాణ ప్రాధాన్యత తగ్గించడమే ఈ నంది మంటలు వెనుక దాగి ఉన్న నిర్ణయం అని కొందరు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: