ఆదాయపు పన్ను శాఖ 1900 మంది నిఘా సిబ్బందితో.187  జయలలితకు సంబంధించిన భవనాలపై జరుగుతున్న దాడులు చాలా సంచలనాలకు దారితీస్తున్నాయి. తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత సహకారి అయినా శశికళ  కూడబెట్టుకున్న అక్రమ సంపాదన బయటకు తీసుకురావడం కోసం కొనసాగుతున్న దాడులు అన్నాడీఎంకేలో  ప్రకంపనలు సృష్టించాయి.

శశికళ అనుకూల వర్గం లో కూడా భిన్న స్వరాలు వినబడుతున్నాయి. శశికళ మేనల్లుడు పార్టీ నాయకుడైన దినకరన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫళనిస్వామి ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ ఈ దాడులు కేంద్ర పరిధిలో జరుగుతున్నాయని అన్నారు. శశికళ సోదరుడు దివాకరన్‌ ఎకంగా జయలలిత పైనే దాడి చేశారు.

ఆమె తన సోదరిని ఉపయోగించుకుంది కానీ తాను చేసిన తప్పుల కి శశికళను బలిచేసింది అన్నారు….అంతేకాకుండా 1996 నుంచి చేన్నైలో కొనసాగుతున్న కేసులన్నిటిలోనూ జయలలిత ప్రథమ ముద్దాయి అని గుర్తు చేశారు అంటూ తన విచారాన్నివ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు అడ్డంతిరుగుతాయని శశికళ మేనల్లుడు దినకరన్ గ్రహించి వెంటనే ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడం జరిగింది…... ఆయన ఏదో ఆవేశంలో అన్నారు కానీ అమ్మ తో సంబంధం మర్చిపోలేనని గర్వకారణమని చెప్పుకొచ్చారు.

శశి కళ  పడుతున్న కష్టాలను జయలలిత కారణం కాదని అన్నారు. అయితే ఈ దాడులు చేయడం అనగా బిజెపి వ్యూహం ఏమిటి అంటే అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ను లొంగ  తీసుకోవడం కోసమే అనే విశ్లేషకులు అంటున్నారు. అయితే డిఎంకె నాయకుడు  అయిన స్టాలిన్ ఒక ప్రకటనను విడుదల చేస్తూ అన్నాడీఎంకే ను లొంగ తీసుకొని రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తే కేంద్రం కన్న కలలు, కలలుగానే మిగిలిపోతాయని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: