రష్యా టెన్నిస్ బామ మరియా షరపోవాపై మోసం, నేరపూరిత కుట్ర అభియోగాల కింద గూర్గావ్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళ్తే, హోంస్టెడ్ అనే రియలెస్టేట్ కంపెనీ 'బాలెట్ బై షరపోవా' పేరుతో విలాసవంతమైన అపార్ట్ మెంట్లను నిర్మించేందుకు 2012లో భారీ మొత్తంలో పెట్టుబడులను సేకరించింది. ఈ వెంచర్ ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ లో ఉంది. ఈ కంపెనీకి షరపోవా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతో చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు.

Image result for ballet by sharapova

టెన్నిస్ అకాడమీ, క్లబ్ హౌస్, హెలీప్యాడ్ కూడా ఉంటుందని అప్పట్లో నిర్వాహకులు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అంత పెద్ద వెంచర్ తమకు చోటు దక్కుతున్నందుకు కొనుగోలు దారులు ఎంతో సంబర పడ్డారు.  తీరా చూస్తే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలు కాలేదు. 

Image result for ballet by sharapova

మొత్తానికి తాము ఆ సంస్థ చేతుల్లో మోసమోయామని తెలుసుకున్న కొనుగోలు దారులు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరో ట్విస్ట్ ఏంటంటే..ఇంటి యజమానులకు అనుగుణంగా ప్రత్యేకమైన, భిన్నమైన ఇండ్లను అందించడమే తమ లక్ష్యమని షరపోవా చెబుతున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో రాశారని, అందుకే ఈ కేసులో ఆమె హస్తం కూడా ఉందని న్యాయవాది పీయూష్ సింగ్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: