ఆంధ్రప్రదేశ్ మంత్రులు చిత్ర పరిశ్రమ పై ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారు. తెలుగుచలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో ఉండటం తమకి అచ్చి రాని పరిస్థితి గా పరిగణిస్తున్నారు. ఏపీ మంత్రి లోకేష్, వారి భార్య పిల్లలు, తల్లి గారు  హైదరాబాదులోని ఉంటున్నారని మనందరికీ తెలుసు ..  వారికి అక్కడ పెద్ద నివాసం కూడా ఉంది, విజయవాడలో లో మాత్రమే కాకుండా  హైదరాబాదులో కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి వీరికి. తెలుగు పరిశ్రమని లోకేష్ సహాయం తో విజయవాడ వైపు తరలిద్దాం అని కొందరి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని ఇండస్ట్రీ కి సంబంధించిన కొందరు హైదరాబాద్ లో నారా లోకేష్ ని పర్సనల్ గా కలుస్తున్నారు అని సమాచారం.

అయితే గత చరిత్రను చూసినా వివిధ వ్యవస్థల తరలింపు అంత సులభంగా త్వరితంగా జరగలేదు. 1952లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడినా మరో నలభై ఏళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే వుండిపోయింది. 1990లలో గాని ఈ క్రమం వేగం పుంజుకోలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాదు  రావాడానికి ఎంతో కృషి చేసిన అక్కినేని, ఎన్టీఆర్‌ వంటి వారు నిర్మించిన స్టుడియోలు కూడా రాష్ట్రం ఏర్పడకా ఇరవై సంవత్సరలకు  స్టూడియోలు నిర్మించుకున్నారు.

తర్వాత ఎన్టీఆర్  ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్టూడియో లు యజమానులయిన కృష్ణ, అక్కినేని వంటి వారికీ  ప్రభుత్వానికి పెద్ద గొడవలే జరిగినాయి.అంత కాలం సినిమా పరిశ్రమ కొనసాగితే తప్పు కాదు గాని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్ర కేంద్రమైన ఉమ్మడి రాజధానిలో సినిమా పరిశ్రమ మూడేళ్లు వుండటం నేరమా? ఇలాంటి  ఆలోచనలూ అభ్యంతరాలూ ఎందుకు వచ్చినట్టు?

అప్పటి పత్రిక రంగం కూడా మద్రాస్ నుండి రాష్ట్రనికి రావడానికి దశబ్ద కాలం పట్టింది. ప్రజాశక్తి అనే పత్రిక ఒక్కటే అప్పట్లో పునః ప్రారంభించిన పత్రిక. చాలా పత్రికలు పునప్రారంభంకావడానికి చాలా సమయం పట్టింది.ప్రధాన మీడియా సంస్థలు టీవీ కేంద్రాలు కూడాహైదరాబాదులోని  కొన్ని  ఇలాటివి ప్రోత్సాహకాలు రాయితీలతో జరగాల్సిందే తప్ప ఉక్రోషాలూ ఆక్రోశాలు పనిచేయవు. కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వ మంత్రి నారా లోకేష్ కి నెమ్మదిగా పరిశ్రమ ని విజయవాడ సైడ్ నడిపించే ప్రయత్నం చేసి ఆ క్రెడిట్ పొందాల్సింది గా వెరైటీ సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: