ఒకప్పటి మాజీమంత్రి తెలుగుదేశం నాయకుడు అయిన నాగం జనార్ధన్ రెడ్డి. తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఆ తరువాత పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుతో మనస్పర్ధలు వచ్చి టీడీపీ నుండి బయటకు వచ్చి బీజేపీ లోజాయిన్ అయ్యారు. అయితే నాగం జనార్దనరెడ్డికి బిజెపిలో ' ప్రజల స్థానం ప్రాధాన్యం లభించలేదు' అనే అసంతృప్తి నాగం జనార్ధన్ రెడ్డి వర్గంలో ఈ మధ్య కనిపిస్తుంది. ఒకప్పటి టిడిపి నాయకుడైన రేవంత్ రెడ్డి పార్టీ మారడంతో నాగం అనుచర వర్గంలో కూడా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు, బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి మరో నేతను వెతుకులాటలో నాయకత్వం ఉంది.

అయితే నాగం కూడా ఈసారి అసెంబ్లీ కి పోటీ చేయడమే కరెక్ట్ అని ఆయన ఆలోచిస్తున్నారంట. రాష్ట్ర రాజకీయాల్లో తన గత వైభవాన్ని చూపించాలంటే అసెంబ్లీకి పోటీ చేయడమే మంచిదాని అనుకొంటున్నారట. పార్టీ నుండి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గానైన పోటీచేయాలని భావిస్తున్నారట. పైకి అలా చెబుతున్నా కాంగ్రెస్ కు  దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి సహాయం చేయడం, దామోదర్ రెడ్డి విజయానికి నాగం జనార్దన్ రెడ్డి కృషిచేయడం...తన బంధువైన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తో  సన్నిహితంగా మెలగడం చూస్తుంటే నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం ఖాయమని కొందరు భావిస్తున్నారు. ఎలాగో ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవాలని అనే ఆలోచనలలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో నాగంజనార్దన్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.

త్వరలో రాష్ట్ర పర్యటనకు రాబోతున్న రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి  కండువా కపుకోనున్నారు.ఈ నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి కూడా పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం మొదలైంది. అయితే కాంగ్రెస్ లో డిస్కషన్ వేరేగా ఉంది , పార్టీ లోకి రీసెంట్ గా వచ్చిన రేవంత్ కి టార్గెట్ లు పెరుగుతున్నాయి అనీ ఒక సీనియర్ లీడర్ ని పార్టీ లోకి తీసుకుని వచ్చే టార్గెట్ రేవంత్ కి ప్రస్తుతం ఉంది అనీ ఆయన గేలం కూడా నాగం వైపే నడుస్తోంది అంటున్నారు. టీడీపీ లో ఉన్నప్పుడు నాగం - రేవంత్ బాగానే క్లోజ్ ఉండేవారు, సో ఆ చొరవ తో ఇప్పుడు నాగం తో రేవంత్ మంతనాలు సాగిస్తున్నాడు అన్ని తెలుస్తోంది. టిడిపిలో ప్రాధాన్యత లేదు భాజపాలో భవిష్యత్తు లేదు గడిచిన నాలుగేళ్లూ రాజకీయంగా చాలా వెనకబడ్డ.. కనుక ఈ క్రమంలో నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: