తమిళనాట మన్నారుగుడి మాఫియా శశికళ నేత్రుత్వంలో రూపుదిద్దుకుంది. ఆ మాఫియా ఆస్థుల విలువ ఐదు లక్షల కోట్ల రూపాయిలంటున్నారు. ఏదేమైనా అత్యంత దురాశ తో ముఖ్యమంత్రి జయలలిత నీడలో చుట్టేసిన సంపద కళ్లు చెదిరేలా ఉంది. అన్నా-డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితు ల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

శశికళ, ఆమె కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలను కొనుగోలు చేసి, బినామీల ద్వారా వాటిని నిర్వహిస్తున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమపై వరుసగా జరుగుతున్న దాడు లకు జయలలితే కారణమని శశికళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాను మరణించి న తరువాత శశికళ పరిస్థితి ఏంటన్న విషయాన్ని జయలలిత ఏమాత్రం పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడీ దుస్థితి దాపురించిందని శశికళ సోదరుడు దివాకరన్ సంచ లన వ్యాఖ్యలు చేశారు.

sasikala with dinakaran & divakaran కోసం చిత్ర ఫలితం


మన్నార్ గుడి మాఫియా లో కీలక వ్యక్తిగా ఉన్న దివాకరన్, మీడియాతో మాట్లాడుతూ, జయలలిత తప్పిదాలే తమ పాలిట శాపాలుగా మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నమ్మను వాడుకున్న జయలలిత, ఆమె క్షేమం కోసం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సైతం ఇదే విధమైన ఆరోపణలు చేయడం గమనార్హం.   


'అమ్మ'తో సన్నిహితంగా ఉండటం వల్లే శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ లు జైలుకు వెళ్లాల్సివచ్చిందని అన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి జయలలితేనని అన్నారు. శశికళ కుటుంబీకులు చేసిన మోసం వల్లే అమ్మపై కేసు నమోదైందని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అదే జరిగితే జయలలిత ఎందుకు దోషిగా తేలిందని మీడియాను దినకరన్ ఎదురు ప్రశ్నించారు.
సంబంధిత చిత్రం

జయలలిత మరణం తరువాత తమకుటుంబానికి కష్టాలు వచ్చాయన్న విషయం ప్రతిఒక్కరికీ తెలుసునని ఆయన అన్నాడు. మరోవైపు గత పది రోజుల నుంచి కొనసాగు తోన్న సోదాల్లో కీలకమైన ఆధారాలు లభించినట్లు అధికారులు పేర్కొం టున్నారు. శశికళ ఆమె కుటుంబ సభ్యుల ఇప్పటికే పన్ను ఎగవేత ద్వారా రూ.1500 కోట్లతో పాటు వారి ఆస్తుల విలువ రూ.30 వేల కోట్లు ఉంటుంది గుర్తించారు. వీటితోపాటు మరో రూ.5 లక్షల కోట్లు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు మరో సారి దాడులకు సిద్దమవుతున్నారు.

దీన్నిబట్టి టిటివి దినకరన్, దివాకరన్లు శశికళ ఆమె మన్నర్గుడి బందువర్గం సన్నిహితవర్గం జయలలితకు బినామిలుగా ఉన్నరని ఒప్పుకున్నట్లేకదా! అలా ఒకరికి బినామీగా ఉండటం కూడా నేరమేకదా! దీన్ని కూడా విచారణాంశంగా చేర్చవలసి న అవసరముందని వైరిపక్షాలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: