ఏపీ సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే మ‌రోసారి కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తారంటూ వార్తలు వ‌స్తున్నాయి. ఈ యేడాది ఆరంభంలో కేబినెట్‌లో భారీ మార్పులు, చేర్పులు చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు మంత్రుల‌ను త‌ప్పించి, కొద్ద‌గా మ‌రి కొంద‌రు మంత్రుల‌ను తీసుకుని ఈ టీంతోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక చంద్ర‌బాబు తాజా కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఒక‌టి రెండు నెల‌ల్లోనే ఉంటుంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఇద్ద‌రు మంత్రులు అవుట్ లిస్టులో ఉంటే, ముగ్గురి పేర్లు ఇన్ లిస్టులో వినిపిస్తున్నాయి. 

chintamaneni prabhakar కోసం చిత్ర ఫలితం

కేబినెట్ నుంచి అవుట్ అవుతోన్న వారి లిస్టులో మంత్రి నారాయ‌ణ పేరుతో పాటు ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేరు లైన్లో ఉంది. నారాయ‌ణ‌ను కేబినెట్ నుంచి త‌ప్పించి, ఆయ‌నకు ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తార‌ని తెలుస్తోంది. ఇక ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించి వ‌చ్చే యేడాది ఆరంభంలో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని తెలుస్తోంది. 

jc prabhakar reddy కోసం చిత్ర ఫలితం

ఇక కొత్త‌గా కేబినెట్‌లోకి వ‌స్తార‌ని పేర్లు వినిపిస్తోన్న వారిలో ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ పేరు వినిపిస్తోంది. మూడుసార్లు గెలిచిన ర‌వికుమార్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ అండ‌తో గొట్టిపాటికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం అడ్డు చెప్పినా స‌రే ప్ర‌కాశం జిల్లాలో పార్టీని ముందుకు న‌డిపించాలంటే అది గొట్టిపాటి వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు, లోకేష్ భావిస్తుండ‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.


ఇక అనంత‌పురం జిల్లాలో సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న జేసీ సోద‌రుల‌ను సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ.ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరును కూడా కేబినెట్ రేసులో ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక టీడీపీకి కంచుకోట లాంటి ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పేరు కూడా మంత్రి ప‌ద‌వి రేసులో ఉంది. ప్ర‌భాక‌ర్ వివాదాస్పద నేత అయినా జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భాక‌ర్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అండగా ఉంటూ ప‌నులు చేయిస్తున్నారు. దీంతో ప్ర‌భాక‌ర్ పేరును కూడా తాజా ప్ర‌క్షాళ‌న‌లో కేబినెట్ బెర్త్ కోసం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ఇన్‌, అవుట్ లిస్టులో ఈ స‌మీక‌ర‌ణలు ఇలా ఉన్నా ప్ర‌క్షాళ‌న చేస్తే ఆ టైంకు ఇవి ఇంకెలా ?  మార‌తాయో ?  చూడాలి. 

gottipati ravi kumar కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: