దేశ సేవ దాత్రుత్వం గురించి అనేకమంది మాట్లాడతారు. కాని దాన్ని ఆచరించే వారు బహుస్వల్పం. కొందరు ఆ సుగుణం కలిగున్నవారు తమ సంపదను తృణప్రాయం గా త్యజించ గలుగుతారు. అలాంటి వ్రేళ్ల మీద లెక్కబెట్టనున్నంత మంది కూడా దేశం లో ఉండటం కష్టమే. ఆ బహుస్వల్ప దాత్రుత్వ స్వరూపుల్లో సునీల్ భారతీ మిట్టల్ ఒక ఆణిముత్యం.   

sunil bharati mittal announced his charity కోసం చిత్ర ఫలితం

టెలికం దిగ్గజం "భారతీ ఎయిర్‌టెల్‌‌" చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ భారీ విరాళాన్ని ప్రకటించారు. తమ గ్రూప్‌నకు చెందిన దాతృత్వ సంస్థ "భారతి ఫౌండేషన్‌" కు తమ సంపదలో పదిశాతం వాటాను అంటే రూ.7000 కోట్ల రూపాయిలను విరాళంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌ లో భారతి కుటుంబానికి ఉన్న మూడు శాతం వాటా కూడా ఈ మొత్తం లోనే ఉందని భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు.

sunil bharati mittal announced his charity కోసం చిత్ర ఫలితం

వెనకబడిన వర్గాలకు చెందిన నిరుపేద యువత కు ఉచిత విద్య అందించేందుకు "సత్య భారతి విశ్వవిద్యాలయాం" ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ లో "టెక్నాలజి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్ సైన్సెస్ మొదలైనవి ప్రధానంగా నేర్పించనున్నట్టు వివరించారు. ఉత్తర భారత దేశంలో ప్రారంభం కానున్న ఈ యూనివర్సిటీ 2021 నుంచి కార్యకపాలు ప్రారంభించనుంది. తొలి విడతలో పదివేల మంది విద్యార్థులతో  "అకడమిక్ సెషన్" ప్రారంభం కానుంది. ఈ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమయ్యే భూమి కోసం చర్చలు జరుపుతున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు.

sunil bharati mittal announced his charity కోసం చిత్ర ఫలితం 

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, టెక్ టైకూన్ నందన్ నీలేకని, అతని భార్య రోహినీ నీలేకని లు తమ సంపదలోని సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన కొన్ని రోజు లకే సునీల్ భారతీ మిట్టల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

quotes on generousness in telugu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: