తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ భవిష్యత్తును  కాపాడుకోవడం కోసం తమ ప్రయత్నాలను ఇప్పటి నుండే మొదలు పెడుతున్నట్టు ఉన్నారు.ఇంకా పార్టీలో ఉంటే రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమని తెలంగాణ టిడిపి నాయకులు భావిస్తున్నారు. మొన్నామధ్య పార్టీని పటిష్ట పరచడానికి చర్యలు తీసుకుంటున్నామన్న టిడిపి పెద్దలు దిగువ  స్థాయిలో ఉన్నా కార్యకర్తలకు భరోసాను చూపించలేకపోయారు.ఈ పరిణామంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమా మాధ‌వ రెడ్డి పార్టీకి గుడ్ బై  చెప్పడానికి అంతా సిధం చేసుకున్నారు.

తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె  ప్రస్తుత అధికార పార్టీ  టిఆర్ఎస్  తీర్దం పుచ్చుకోడానికి సిద్ధమైపోయారు... మాధవరెడ్డి తెరాసలోకి రావడానికి అధికార పార్టీ పెద్దలు చక్రం తిప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఉమామాధవరెడ్డి పార్టీ మారుతరాని  ఎప్పటి నుండో  వినబడుతున్న వార్త. ఆమె తెరాస‌లో చేర‌తారని ఎవరు  అనుకోలేదు! ఒక్కపుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే  సిద్ధ‌మ‌య్యారు. ఇదే విష‌యమై ఆ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి టిక్కెట్ కూడా ఖాయ‌మైంది. జిల్లాలోని కీల‌క నేత‌లైన కోమ‌టిరెడ్డి సోద‌రుల‌తో కూడా ఆమె భేటీ అయ్యారు.తన కుమారుడు సందీప్ రెడ్డి తో  కలిసి  కాంగ్రెస్ కండువా కపుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు కూడా అని ఏర్పాట్లు చేసారు.

కానీ చివరి నిమిషంలో ఇప్పుడు ఆమె తెరాస లో జాయిన్ అవడం ఆశర్యకరమైన విషయం.దీని వెన‌క తెరాస ఆప‌రేష‌న్ ఆకర్ష్  ఉంద‌నే చెప్పొచ్చు. తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌న్న వాతావ‌ర‌ణం ఈ మ‌ధ్య మ‌ళ్లీ క‌నిపిస్తోంది. ముఖ్యంగా, రేవంత్ రెడ్డి పార్టీలో చేరాక కొంత ఊపు వచ్చింది. ఆయ‌న‌తోపాటు కొంత‌మంది నేత‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డంతో.. అధికార పార్టీ తెరాస కాస్త జాగ్ర‌త్త‌ప‌డ‌టం ప్రారంభించింది.దీంతో అధికారి పార్టీ తెరాస ఆపరేషన్ ఆకర్ష అస్త్రం ప్రయోగించింది ఈ అస్త్రంతో అధికార పార్టీ బలంగా ఉందని చూపిస్తూ మరొక పక్క కాంగ్రెస్ లో కి వెళ్ళే నాయకుల వలసలు అడుకోవచ్చు అని ఈ ప్లాన్ ప్రయోగించింది.

అయితే పార్టీ లో జాయిన్ అయిన  ఉమా మాధ‌వ‌రెడ్డి కి ఏ పదవి కతబెడుతునారో స్పష్టత ఇవ్వలేదు . ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.రాబోయే ఎన్నికలలో టికెట్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియాన్ని విషయం . ఈ నేపథ్యంలో ఆమె తన కుమారున్ని తో కలసి తెరాస లో చేర‌బోతున్నారు.తెరాస అనుస‌రిస్తున్న ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ నేత‌లు ఎలా స‌మ‌ర్థంగా అడ్డుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: