అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్ పర్యటన చరిత్రాత్మకమైన పర్యటన  అవుతుందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ పర్యటన కి సంబంధించి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు మీడియా అయితే ఆమె తిండి దగ్గర నుంచీ అన్నీ అప్డేట్ లు ఇస్తోంది, మరొక పక్క ఆమె రాక కి సంబంధించి అధికారులు చేస్తున్న హంగు ఆర్బాటాలు సామాన్య ప్రజలకు విసుగు కలిగిస్తున్నాయి అని కూడా చాలా మంది భావిస్తున్నారు. ట్రంప్ కూతురు ఎప్పుడు వస్తుందో  ఎలా వెళ్తుందో  తనకు తెలియదాన్ని అంతా అమెరికా ప్రభుత్వం చూసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి రీసెంట్ గా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ..ఈ నేపధ్యం లో చాలా రోడ్లు అమెరికా ప్రభుత్వం పరిధిలోకి వెళ్లినయి  అని భద్రతా ఏర్పాట్లు  వారే చుసుకుంటున్నారు అని తెలుస్తోంది.

బిక్షుకుల అరెస్టులు, వీధికుక్కల తగ్గించేందుకు వాటి  మీద విష  ప్రయోగం చేయడం వంటి చర్యలపై జంతు రక్షణ హక్కుల సంస్థ లు ఆగ్రహం వెళ్ళబుచుతున్నాయి. పేరు సంపాదించు కోవడం కోసం మన ప్రభుత్వాలు ఇంత అతిగా ప్రవర్తించడం నిజంగా బాధాకరం. ఒకప్పుడు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు తనతోపాటు తన కూతురిని తీసుకొచ్చారు. 

ఆమె తనకుక్క పిల్లను తీసుకురాలేదని మీడియూ అదేపనిగా వాపోయింది. క్లింటన్‌ పార్లమెంటును సందర్శించినప్పుడు మన దేశ యం పి లు కరచాలనం కోసం మిద మిద పడ్డారు. ఇదీ ఇలా ఉంటె అమెరికా  దేశంలో మన దేశ రాష్ట్రపతిని రక్షణ మంత్రిని కూడా విమానాశ్రయంలో వదిలి పెట్టకుండా తనిఖీలు చేసే  దేశం అది, అలా  వ్యహరించే  వారికి ఇక్కడ కూడా వారి హక్కుల  ప్రకారమే భద్రతా ఏర్పాట్టు చేయాలి కానీ , అధికారం మొత్తం వారి చేతికి అప్పగించడం దారుణం.

ఈ క్రమం లో మన దేశ ప్రధాని ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి..భారత దేశం ఘనత గురించి అంతగా చెప్పే వారు కనీస ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోలేకపోవడం సిగ్గు చేటు. అన్నిటికంటే ఎక్కువగా జంతు పరిరక్షణ వారు వీధి కుక్కలకి విషం పెట్టడం అనే దాని మీద యమా సీరియస్ గా ఉన్నారు. ఇవాంక కోసం అమాయక ప్రాణాలని చంపుతారా అంటూ వాపోతున్నారు వారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: