ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంచ పోలవరం...అయితే పోలవరం ప్రాజెక్టు అంత సామాన్యమైనది కాదు..ఎప్పటి నుంచో ఏపీ ప్రజలను ఊరిస్తూ వస్తున్న ప్రాజెక్టు.  అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి..కానీ ఈ ప్రాజెక్టు పనులు మాత్రం పూర్తి కావడం లేదు.  అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును చాలా ప్రిస్టేజియస్ గా తీసుకొని పూర్తి చేస్తానని అంటున్నారు.  ‘పోలవరం నా ఆశ, నా శ్వాస. ప్రాజెక్టు పూర్తి కావడం నా జీవిత లక్ష్యం. కేంద్రం సహకారం అందిస్తేనే అది సాధ్యం. 

Image result for polavaram project

 2019 కల్లా ఏపీ జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తిచేసి తీరుతాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్నారు.  ఆ మద్య పోలవరం పనులు చేస్తున్నట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులను అనుకున్న విధంగా పరుగులెత్తించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమవుతుండటంతో 60సీ నిబంధనల కింద నోటీసులు జారీ చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాజాగా పోలవరంలో మట్టి తవ్వకం పనులు వేగంగా సాగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. 

Image result for polavaram project

ఇంత చేసినా కాంక్రీట్‌ పనులు పూర్తి కాకపోవడంతో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనుల్లో 60 శాతం పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు టెండర్లు పిలిచామన్నారు. నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు బాగున్నాయని చెప్పారు. ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ, పరిహారం, పునరావాసం వివరాలపై కేంద్రానికి త్వరలో నివేదిక ఇస్తామని తెలిపారు.పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సహకరించాలని కమిటీ సభ్యులను సీఎం చంద్రబాబు కోరారు. 


ప్రాజెక్టుకు కేంద్రం మరింత వేగంగా నిధులను మంజూరు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారానికి కనీసం నాలుగు గంటలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే తాను దృష్టి పెడుతున్నానని వివరించారు.పలు రాష్ట్రాల్లో కేంద్రం నిర్మిస్తున్న 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు పనులు కూడా చురుగ్గా ముందుకు సాగడం లేదన్నారు. కేంద్రం రూ.54,000 కోట్ల నిధులు సక్రమంగా విడుదల చేస్తే ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: