ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం పార్టీ కార్యక్రమాలతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో బిజీ, బిజీగా  గడుపుతుంటారు. అలాగే పార్టీ సమావేశాల్లో కానీ, అధికారులతో సమీక్ష సమావేశాల్లో కానీ, చంద్రబాబునాయుడు నవ్వుతూ మాట్లాడడం చాలా అరుదుగా కన్పిస్తోంది. కానీ ఇలా ఉండడం వల్ల‌ అనవసర తలనొప్పి అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు జోక్‌లు వెయ్యడం ప్రారంభించారు. ముఖం నిండా నవ్వు పులుముకొని మంత్రులపై ఆయన జోకులు వెయ్యడంతో అధికారులు, మంత్రులు ఆనందంతో ఆశ్చర్యపోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు కూడా నవ్వుకోవడం ఆశ్చర్యకరం. సీరియస్‌గా, గంభీరంగా ఉంటే పనులు జరగవని భావించిన ముఖ్యమంత్రి జోకులు వేసి మరీ అందరినీ నవ్విస్తూనే.. చురకలు అంటించడం ప్రారంభించారు. 

nimmakayala chinarajappa కోసం చిత్ర ఫలితం

ప్రతి నెలా చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాకాధిపతులు, కమిషనర్‌లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుంటారు. తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైళ్ళ క్లియరెన్స్‌ గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అందరిపై జోకులు వేస్తూ ఉల్లాసంగా కనిపించారు. ఇప్పటికే  ఫైళ్ళ క్లియరెన్స్‌ చెయ్యడంలో  హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారా లోకేష్‌ ముందంజలో ఉన్నరు. "వీళ్ళు ఇద్దరూ వచ్చిన ఫైళ్ళు వచ్చినట్టు పంపుతున్నట్టున్నారు. అందువల్లే ముందంజలో ఉన్నారు'' అంటూ జోకు వేశారు. తాము ఫైళును పరిశీలించి, పరిష్కరించి పంపుతున్నమనీ, ఎక్కడా జాప్యం చేయడంలేదనీ ఆ మంత్రులు కూడా తిరిగి సమాధానం చెప్పారు. 

nara lokesh కోసం చిత్ర ఫలితం

ఆ తరువాత గంట శ్రీనివాసరావు గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన చంద్రబాబు గట్టిగానే చురకలు వేశారు. ఆ తరువాత  వ్యంగ్యంగా మాట్లాడుతూ .."ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పడు వెళతారో, ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అందువల్లనే ఫైళ్ళు క్లియరెన్స్ కావడం లేదు'' అని వ్యాఖ్యానించారు. చివరకు తన పేషీలో కూడా ఒక్కో ఫైలు రెండు మూడు రోజులపాటు ఉండటం పై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. "నా పేషీలోనే ఇలా ఉంటే.. నేను మిగతావారిని ఎలా అడుగుతాను?'' అని పేషీ అధికారులకు చురకలు అంటించారు. కొంతమంది మంత్రుల వద్ద ఒక్కో ఫైలు అయిదు నుంచి ఏడురోజులు ఉండటం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. 

ganta srinivasa rao కోసం చిత్ర ఫలితం

ఆ తరువాత సరదా సరదాగా సాగిన ఈ సమావేశంలో కొంతమంది అధికారులకు కూడా సీఎం చంద్రబాబు నవ్వుతూనే చురకలు అంటించారు. కొందరు అధికారులు ఫైళ్ళను వెంటనే క్లియర్ చేస్తున్నామని చెబుతున్నారనీ.. తీరా పరిశీలిస్తే అందులో 90 శాతానికి పైగా ఫైళ్ళు ఎటువంటి పరిష్కారం లేకుండానే పంపుతున్నారనీ ముఖ్యమంత్రి తెలిపారు. పరిశీలించి పంపటం అంటే పరిష్కారం లేకుండా కిందకు పంపడమా? అని ఆయన సంబంధిత అధికారులను నిలదీశారు. దీనిపై కొందరు అధికారులు వివరణ ఇవ్వబోయారు. చివరకు రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: