నోట్ల రద్దు తర్వాత కూడా డిజిటల్ వైపు జనం మొగ్గుచూపటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చెక్కులు రద్దు చేయాలని భావిస్తోంది కేంద్రం. అంతేకాదు. ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2016 నవంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు డిజిటల్ పేమెంట్స్ 31శాతం పెరిగాయి. ఇటీవల వ్యాపారుల సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్ చెక్‌బుక్‌ల రద్దు అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. న‌గ‌దు ర‌హిత లావాదేవీలను ప్రోత్స‌హించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంద‌రూ భావించారు.

చెక్ బుక్ లను రద్దు చేస్తే… డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్రం అనుకుంటున్నట్లుగా చెక్ బుక్ లను రద్దు చేస్తే నిజంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి సరైన సమాధానం లేదు.  నిజంగానే కేంద్రం చెక్‌ బుక్ లను రద్దు చేస్తే… చిరు వ్యాపారుల నుంచి బడా పారిశ్రామిక వేత్తల వరకూ దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సరుకు రవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయే ప్రమాదముంది.

ఈ విష‌యంపై అంద‌రిలోనూ చ‌ర్చ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో కేంద్ర‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ... చెక్‌బుక్‌లను రద్దు చేసే యోచన లేద‌ని స్ప‌ష్టం చేసింది. నల్లదనం అరికట్టటానికి కూడా చెక్ బుక్ ల రద్దు దోహదం చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన చేయటం లేదని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: