ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మనుష తీరు తెన్నులు చాలా మారిపోయాయి.  ఒకప్పుడు ఫోటోలు తీసుకోవాలంటే పెద్ద హంగామా ఉండేది..కానీ ఇప్పుడు సెల్ ఫోన్ల పున్యమా అని మన ఫోటో అంటే సెల్ఫీలు మనమే తీసుకునే సదుపాయం వచ్చింది.  దీంతో ఇప్పడు జనాలకు సెల్ఫీ మోజు బాగా పెరిగిపోయింది.  అయితే ఈ సెల్ఫీ మోజులు కొన్ని సార్లు ప్రమాదంలో పడటం...ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

తాజాగా బెంగాల్‌లో ఓ దారుణం జరిగింది.   బెంగాల్ లోని  జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన 40 ఏళ్ల సాదిఖ్‌ ఓ బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.  గురువారం సాయంత్రం సమయంలో  లతాగురి అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా ఓ ఏనుగు అతడి కంటపడింది.  మనోడికి ఓ పిచ్చి కోరిక కలిగింది..ఆ ఏనుగుతో సెల్ఫీ దిగి తన ఫ్రెండ్స్ కి షాక్ ఇవ్వాలనుకున్నాడు.

కానీ సీన్ రివర్స్ అయ్యింది..సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా సాదిఖ్‌పై ఏనుగు దాడి చేసింది. అటువైపు వెళ్తున్న కొందరు అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తాయని, సెల్ఫీల కోసం వాటి జోలికి వెళ్తే ప్రమాదమని అధికారులు హెచ్చరించినా వినలేదు.. చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. గతేడాది ఇదే ప్రాంతంలో ఏనుగుల దాడిలో 84 మంది మరణించడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: