ఈ మద్య తెలంగాణలో శిక్షణ విమానాలు తరుచూ ప్రమాదాని గురి అవుతూ ఉన్నాయి.  తాజాగా సిద్దిపేట జిల్లాలో శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది.   సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తగా కట్టిన కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానం పూర్తిగా దగ్ధమైంది.శిక్షణ విమానం హకీంపేట్‌ శిక్షణ కేంద్రం నుంచి  బయల్దేరిన కొద్దిసేపటికే సాంతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.


విమానంలో ఉన్న​ ముగ్గురు పైలెట్లు పారాచూట్‌ సాయంతో కిందికి దూకారు. వారిలో రోహిణి అనే పైలెట్‌ రాజీవ్‌ రహదారిపై, మరొకరు దుద్దెడ టోల్‌ గేట్‌ వద్ద, ఇంకొకరు విద్యుత్‌ స్టేషన్‌ వద్ద ల్యాండ్‌ అయ్యారు. ఈ క్రమంలో రోహిణి కాలు విరగడంతో ఆమెను వెంటనే  108 సిబ్బంది జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ భవన సమీపంలో కూలిన విమానం పూర్తిగా దగ్దమైంది.


పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపల విమానం పూర్తిగా దగ్ధమైంది. కాగా శిక్షణా విమానం కూలిన ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: