నీళ్ళు నిధులూ నియామకాలు అనే అంశాలు ప్రాధమ్యాలుగా సాగిన తెలంగాణా ఉద్యమం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో శాంతింతించింది. నాడు కేసిఆర్ కు అండదండగా నిలిచి తెలంగాణా పోరును ముందుండి నడిపించిన తెలంగాణా సేనాపతిగా కోదండ రాం ను పూచికపుల్లతో సమానంగా చూస్తున్న కేసిఆర్ కు తెలంగాణ హైకోర్ట్ బలంగా షాకిచ్చింది.
Image result for kcr family members in politics

"అవసరం తీరిన తరవాత అల్లుడు,..."  అన్న సామెత తీరుగా ప్రవర్తిస్తున్న కెసిఆర్ పై తెలంగాణా జనం గుర్రుగా ఉన్నారు. కారణం ఈ నాలుగేళ్ళు గా ఆయన ఆయన కుటుంబం నిజాం నవాబుల్లా అత్యంత నియంతృత్వ పోకడ లతో పాలన నెరపటమే. 

Image result for sunburn show telangana case high court  judgment

ఈ కేసుతో కలిపి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుకు మామూలు షాక్ కాదు "మూడు తీర్పులు ఆరు షాకులు" అన్న చందంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తీర్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా వచ్చాయి. అంతే కాదు ఈ మూడు అతి ముఖ్యమైనవే. ప్రధానంగా రెండు కేసులు అయితే, నాటి తెలంగాణ ఉద్యమంలో తన వెన్నంటి నడిచిన ముఖ్యమైన శక్తులు - వ్యక్తులకు చెందినవి. శుక్రవారం హైకోర్టులో వచ్చిన మూడు తీర్పుల విషయానికి వస్తే ఒకటి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు పంటికింద రాయిలా మారిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాం ఉదంతం. రెండోది తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఇటీవలి కాలంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులు కాగా, మూడవది, కేసీఆర్ ను చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా భావించే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన "సన్ బర్న్ షో" తన పాలన తీరుపై న్యాయవ్యవస్థ ఏమనుకుంటుందో అని కేసిశార్ బేరీజ్ వేసుకుంటే తనకే అర్ధమౌతుంది. తన పాలన ఎంత అర్ధవంతంగా ఉందో చెప్పటానికి.  

Image result for telangana koluvu kolkata sabha kodanda leadership

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం నాయకత్వంలో కు "కొలువుల కొట్లాట" అనే కార్యక్రమానికి సంబంధించిన సభ జరుపుకోవటానికి అనుమతి కోరిన నేపధ్యంలో ఆయన కు ప్రజాస్వామ్య పద్దతిలో అనుమతి నివ్వకుండా సాగదీసిన కెసిఆర్ ప్రభుత్వ నిత్యంతృత్వానికి హైకోర్ట్ చెక్ పెట్తింది. కొలువుల కొట్లాట విషయంలో తెలంగాణా హైకోర్ట్ నిన్న శుక్రవారం అతి కీలకమైన తీర్పునిచ్చింది. కొలువులకై కొట్లాట సభకు అనుమతినివ్వాలన్న కోదండరాం పిటీషను పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 30 డిసెంబరు 1 - 6 తేదీల్లో కాకుండా మిగతా రోజుల్లో సభ జరుపుకోవచ్చని శుక్రవారం హైకోర్టు సూచించింది. పోలీసులకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని ఐకాసకు సూచించింది. దరఖాస్తు అందిన 40గంటల్లో అనుమతి కూడా ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుపై జేఏసీ చైర్మన్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. కొలువులంటే తన కుటుంబములో నలుగురికి ఉన్నత కొలువులిచ్చి తనకై తాను సంతృప్తి చెంది ఉన్న కెసిఆర్ కు "నిరుద్యోగులుగా ఉన్న ప్రజలకు కనీసం చిరుద్యోగమన్నా కల్పించటమని" హైకోర్ట్ గుర్తుచేయటం గమనార్హం.  

Image result for trt notification 10 districts not for 25 districts telangana high court

రెండో కేసు దాదాపుగా ఆరు లక్షల మంది యువత పోటీ పడుతున్న ఉపాధ్యాయ కొలువుల భర్తీలో మెజార్టీ అభ్యర్థుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉమ్మడి పదిజిల్లాలకు కాకుండా, 31 జిల్లా ల ప్రకారం భర్తీ  చేసేందుకు టీఎస్పీఎస్సీ ద్వారా తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయించిన సంగతి తెలిసిందే. దీనిపై విద్యార్థి లోకం భగ్గు మంది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ గా, టీఆర్టీ నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.  టీ ఆర్టీ పై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రక్రియను వచ్చే నెల 15 వరకూ పొడిగించాలని టీఎస్పీఎస్సీ కి ఆదేశాలు జారీ చేసింది. జీవో 25ను సవరించి తీరాల్సిందేనని హైకోర్టు ఈ రోజు విస్పష్ట తీర్పు నిచ్చింది. పది జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ నోటిఫికేషన్ ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇది సర్కారుకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. దాదాపు మెజార్టీ విద్యార్థులు ఈ తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Related image

మరో కేసు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న "సన్ బర్న్ పార్టీ" కి మైనర్లను అనుమతి ఇచ్చారని తెలంగాణా హైకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి అనుమతి కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు పార్టీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు "నిబందనలు పట్టించుకోరా?" అని నిలదీసింది. అనుమతి ఇస్తూనే షరతులు విధించింది. "పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ - లా అండ్ ఆర్డర్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. 30 లోగా వీడియో రికార్డులను సమర్పించాలన్న హైకోర్టు" తుదిపరి విచారణ 30కి వాయిదా వేసింది.
Image result for sunburn show case revanth reddy

అయితే ఈ "సన్ బర్న్ షొ" కేసిఆర్ బందువర్గం నడిపే వ్యాపారం లో భాగమని కాంగ్రెస్ లీడర్ వి. హెచ్.  చెప్పారు. దీంతో తెలంగాణాలో ఉద్యోగాలు వ్యాపారాలు కెసిఆర్ కుటుంబానికే నన్నది విస్పష్ఠమైందని అంతున్నారు తెలంగణా ప్రజలు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో అంతర్భాగమైన తెలంగాణా లో పాలన సజావుగా ప్రజాస్వామ్య పద్దతిలో జరగట్లేదు అన్నదానికి ఈ హైకోర్ట్ తీర్పులే అతి పెద్ద ఋజువులు అంటున్నారు విరక్తి చెందిన ప్రజలు. 

Image result for telangana high court recent 3 judgements on kcr government

మరింత సమాచారం తెలుసుకోండి: