ఆంధ్ర రాష్ట్ర విభజన అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు బిజేపి ఎన్నికల సారథి నరేంద్రమోడి కొత్త వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు తాము తెలంగాణా ఉద్యమం చేస్తే, కాంగ్రెస్ క్రెడిబులిటీ కొట్టకుపోవడం బిజెపికి జీర్ణం కావడం లేదు. ఈమేరకు తెలంగాణ ప్రజలకు అసలు విషయమేంటో హైదరాబాద్ యువసమ్మేళనంలో ఈనెల 11న తెలియచేస్తానని అంటున్నారు.

అయిదేళ్లు పాలనలో తెలంగాణ ఆవశ్యకత గుర్తుకురాని కాంగ్రెస్ కు ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చిందన్నది మోడీ ప్రశ్న.... ఈ అయిదేళ్లలో కూడా ఉద్యమం తీవ్రంగా నడిచి ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నాకూడా తెలంగాణ ప్రకటించకుండా కేవలం ఎన్నికలకు ముందు ప్రకటించడం కేవలం ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఆలోచన కాకపోతే అన్నది ప్రజలకు తెలియచెప్పాలన్నిది మోడి ఆలోచనగా కనిపిస్తోంది.

ఇప్పుడు సీమాంధ్రలో ఇంత అల్లర్లు, ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా, సొంత పార్టీవారి చేత  రాజీనామాలు చేయిస్తూ,  కాంగ్రెస్ డ్రామాలాడుతోంద మోడీ హైదరాబాద్ సభలో విమర్శలు కురిపించే అవకాశం వుంది. అంతే కాదు సీమాంధ్రలో ముందుగానే,తెరవెనుక రాజకీయ ఒప్పందాలు కూడా  జరిగిపోయాయని, అందుకే దిగ్విజయ్ సింగ్ ఆందోలనలు,రాజీనామాలు సహజమే, తెలంగాణను ఎవరు ఆపలేరు అంటున్నాడని ఇందులోనే కాంగ్రెస్ డబుల్ గేమ్ ఉందని వివరించేందుకు బిజేపి సిద్దపడుతోంది.

తెలంగాణ అధికారికంగా విభజన కాకముందే ఎన్నికలకు వెళ్లి అంతా అయ్యాక కాంగ్రెస్ మొండి చెయ్యి చూపాలన్న ప్లాన్ లో ఉందని వివరించేందుకు బిజేపి సిద్దపడుతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిందని, ఎలాగు కేంద్రంలో అధికారంలోకి రాదని, తెలంగాణ ఏర్పడి కాంగ్రెస్ ను గెలిపిస్థే లాభం లేదని, కొత్తరాష్ట్రానికి రెండు చోట్ల ఒకే ప్రభుత్వాలు ఉంటే  మేలని వివరించడం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బతీయయాలని, అదే సమయంలో, తెలంగాణ బిల్లు తాము మద్దతు ఇచ్చిన కారణంగానే విజయం సాధిస్తుందన్నది వివరించాలని లో మద్దతిచ్చి మేం ఇచ్చినందుకే వచ్చింది అని చెప్పి లబ్దిపొందడం వంటి వ్యూహాలతో మోడీ సిద్దమయినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: