ఎన్టీఆర్ వారసుడిగా తెలంగాణ ఏర్పాటును అంగీకరిస్థున్నానని నందమూరి హరిక్రిష్ణ తెలిపారు. ఆయన శుక్రవారం ఓబహిరంగ లేఖ విడుదల చేసారు. ఓ ప్రాంత ప్రజల అభీష్టానిని తలవంచి తెలంగాణ ఏర్పాటును ఒప్పుకుంటున్నానన్నారు. అయితే విభజన కాస్త బాధను కలిగించినా ప్రజల మనోభావాలను గౌరవించాలని  చెప్పారు.

కాంగ్రెస్ మాత్రం తెలుగుప్రజలతో ఆడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఒక ప్రాంతం వారి కళ్లలో కారంమరో ప్రాంతం వారి కళ్లలో కాటుకపెట్టిందన్నారు. సీమాంధ్రవారి ప్రయోజనాలపై మాట మాట్లాడడం లేదన్నారు. నీళ్ల సమస్యనుంచి మొదలు కొని రాజధాని వంటి ఎన్నో ప్రధానసమస్యలపై కాంగ్రేస్ తన వైఖరి స్పష్టంచేయక పోవడం దారుణం అని ఆయన ఆగ్రహం వ్యక్థం చేసారు.

వైఎస్ కూడా తెలంగాణ సీమాంధ్రవారిని రెచ్చగొట్టాడని హరిక్రిష్ణ తెలిపారు. ఎన్నికలప్పుడు తెలంగాణలో పోలింగ్ అయ్యేంత వరకు తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడిఆతర్వాత హైదరాబాద్ వెల్లాలంటే వీసా తీసుకోవాలా.. అంటూ సీమాంధ్ర సభలో ఆవేశంగా పేర్కొని అటు సీమాంధ్రఇటు తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొట్టాడని హరిక్రిష్ణ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: