రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఎలా వస్తాయి.. ఇదీ తన పాదయాత్రలో జగన్ ప్రజలను అడుగుతున్న ప్రశ్న.. వాస్తవానికి పట్టిసీమ నీళ్లు.. రాయలసీమకు రావు.. కానీ పట్టి సీమ నుంచి  వంద టీఎంసీలు కృష్ణా డెల్టాకు ఇవ్వడంతో.. శ్రీశైలంలో ఉన్న కృష్ణా నీళ్లు.. ఏపీ వాటా కింద రాయలసీమకు వాడుకునే వెసులుబాటు దక్కింది. కానీ ఈ అంశాన్ని జగన్ కావాలనే విస్మరిస్తున్నారు. ఇంకా రాయలసీమ సెంటిమెంట్ వాడుకుందామని ప్రయత్నిస్తున్నారు.


అలాంటి జగన్ కు ఇటీవల ఓ అనూహ్యమైన ఘటన ఎదురైనట్టు కథనాలు వస్తున్నాయి. ఇటీవల జగన్ తన పాదయాత్రలో కర్నూలు జిల్లా ఎర్రగుడి అనే ఊరుకెళ్లారు. పాదయాత్ర కర్నూలు జిల్లా ఎర్రగుడి నుంచి అలా ముందుకు సాగుతోంది. ఎర్రగుడి ఊరి చివర్లో ఓ ముసలవ్వ జగన్‌కు ఎదురుపడింది. అవ్వను చూసి ఆగాడు జగన్. అవ్వను దగ్గరకు తీసుకున్నాడు. తలపై ముద్దు పెట్టబోయాడు. అవ్వ పక్కకు జరిగింది.


అవ్వ చేతిలో చిన్న సంచి ఉంది. ఆ సంచిలో ఉడకబెట్టిన వేరుశనగ కాయలున్నాయి... అయ్యా ఇదిగో..ఈ శనిక్కాయలు తిను అంటూ అవ్వ ఉడకబెట్టిన కాయలు జగన్ దోసిట్లో పోసింది. ఆ కాయలు చూసిన జగన్‌... అవ్వా.. శెనిక్కాయలు కొన్నావా? అన్నాడు.. కాదయ్యా … మా చేలోవే. అన్నది. బాగున్నాయే.. బాగా పండిందా మీ చేను అన్నాడు. అవునయ్యా.... మా కయ్యిలో శానా బాగా పడింది. ఈయేడు పుట్లు...పుట్లు... పండాయి అన్నది. వానల్లేవుగా.... ఇంత బాగా ఎలా పండింది అన్నాడు జగన్. 


వానెందుకయ్యా... పట్టిసీమ నీళ్లొస్తే... కాలువ నిండా నీళ్లుంటే... అన్నది. పట్టిసీమ నీళ్లా.. ఏందవ్వో... నేనేమైనా పిచ్చోడ్నా... యాడ పట్టిసీమా? యాడ ఎర్రగుడిపాడు... ఎలా వస్తాయమ్మా పట్టిసీమ నీళ్లు అంటూ అవ్వ వైపు అమాయకంగా చూశాడు. ఆ మాటకు చిర్రెత్తిన అవ్వ.. ఓరి పిచ్చినాయనా? పట్టిసీమ ఎక్కడుందో నీకు తెలవకపోవచ్చు.. కానీ రాయలసీమ మొత్తానికీ... ప్రతి బిడ్డకీ తెలుసు. సీమకు నీళ్లు ఎలా వచ్చాయో.? కాలవలు ఎలా పారుతున్నాయో... కాస్త తెలివి తెచ్చుకో నాయనా...ఇంకో ఊళ్లో ఎక్కడా ఇలా అడగమాకు? జనం తిరగబడతారు. ఇహ జాల్లే నడూ...నడూ... అంటూ సాగనంపింది ఎర్రగుడి అవ్వ... ఈ కథనంలో వాస్తవం ఎంత ఉన్నా.. జగన్ పరిస్థితికి అద్దంపడుతోంది కదా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: