మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. మంచి విధానాలు ఎక్కడ ఉన్నా మనకు అనుకూలంగా మలచుకోవాలి. నేనే గొప్ప.. నాకు తెలిసిందే వేదం.. అంటే అభివృద్ధి అన్నది అక్కడే ఆగిపోతుంది. చుట్టూ ప్రపంచం చూడాలి.. ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి.. అందులో మంచిని మనస్పూర్తిగా స్వీకరించాలి.. ఇదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధాంతం. అందుకే ఆయన పాలన అంత నిత్యనూతనంగా సాగుతుంది. 


అందుకే చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త విధానాలు అమల్లోకి తెస్తుంటారు. టెక్నాలజీని విరివిగా వాడుతుంటారు. సాధించిన దానితో తృప్తి పొందే రకం చంద్రబాబు కాదు. అలాంటి వాడయితే.. నూతనత్వాన్ని స్వాగతించడు. లేటెస్టుగా కొరియా పర్యటనలోనూ చంద్రబాబు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నారు. ఈ మూడు రోజుల పర్యటన ప్రధానంగా పెట్టుబడుల కోసం ఉద్దేశించిందే అయినా.. చంద్రబాబు మిగిలిన అంశాలపైనా దృష్టి సారించారు. 


కొరియాలో పారిశ్రామిక ప్రగతితో పాటు ప్రాధమిక విద్య కూడా చాలా బావుంటుందట. అందుకే చంద్రబాబు తన తాజా పర్యటనలో  ప్రాథమిక విద్యారంగంపైనా దృష్టి సారించారు. ఈ మేరకు దక్షిణకొరియా పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతున్నారు. మీ దేశంలో ప్రాధమిక విద్య చాలా బలంగా ఉంది. మేం మీ ప్రాథమిక విద్యావిధానాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నామని వారితో చంద్రబాబు తెలిపారు. 


ప్రాథమిక విద్యారంగంలో ఇప్పటికే చంద్రబాబు చాలా మార్పులు తీసుకొస్తున్నారు. డిజిటల్ తరగతుల ద్వారా, బయోమెట్రిక్ పద్దతుల ద్వారా ఈ రంగంలో సంస్కరణలు తెస్తున్నారు. ఇప్పుడు కొరియా అనుభవాలను కూడా మేళవించి.. ఏపీలో విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఏపీ అధికారులకు సూచనలిచ్చారు. బట్టీ విధానాలకు స్వస్థిపలిక సాంకేతిక అత్యున్నత విద్యనందించేందుకు ఏపీలో ఇక కొరియా  పాఠాలు చెబుతారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: