టిఆర్ఎస్ ఎంపీ బల్క సుమన్ కోదండరామ్పై ఫైర్ అయ్యారు.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బల్క సుమన్ మీడియా సమావేశం నిర్వహించి, కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు అని ఇన్ డైరెక్ట్ గా కోదండరాం కి పంచ్ లు వేసిన సంగతి తెలిసిందే .అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు.

ఉద్యోగాల కల్పనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను ఆపడానికి కేసులు వేశారు అనీ,  ప్రస్తుతం అయితే ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఉద్యోగాల భర్తీ అనేది చిన్న సమస్య దీన్ని రాజకీయం  చేయడం ఎందుకు అనేది సుమన్ మాట.

తెలంగాణ ప్రజల గెలుపుతో కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండె ల్లో  ఉన్నారని, ఎవరూ  నామినేట్ చేయలేదన్నారు. ప్రజాతీర్పు తో  సీఎం అయ్యారని తెలిపారు, కెసిఆర్ కి  ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పేరును చూసి రాష్ట్రంలో ఉన్న విపక్షాలు  తట్టుకోలేకపోతున్నాయి అని విమర్శించారు.

అయితే ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న సుమన్ లాంటి కుర్ర నాయకులని కెసిఆర్ కావాలనే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా రంగం లోకి దింపుతూ ఉన్నట్టు తెలుస్తోంది. కోదండరాం తో డైరెక్ట్ గా తాను పోరాటం చేసి ఆయన రేంజ్ ని స్థాయి నీ పెంచడం ఇష్టం లేని కెసిఆర్ సైలెంట్ గా బల్క సుమన్ లాంటి వారిని కోదండరాం కి ఎదురు నిలిచేలా చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: