తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక రహస్యాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. జయలలిత కుమార్తె నని చెబుతూ అమృత అనే యువతి తెర పైకి రావడంతో తమిళనాడు లో ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జయలలిత శోభనబాబుల అనుబంధం గురించే ఎక్కువ మంది చర్చించు కుంటు న్నారు. డీఎన్ఏ పరీక్షకైనా సిద్దమంటూ అమృత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడానికి సిద్దమవుతున్నారు.

jayalalitha family కోసం చిత్ర ఫలితం

అమృత పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్ట్ ) ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అమృత కర్ణాటక హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. 

jayalalitha family కోసం చిత్ర ఫలితం

సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో అమృత పేర్కొన్న ప్రకారం నేను“1980 ఆగస్టు 14న జయలలిత కడుపున జన్మించా ను. పెంపుడు తల్లి శైలజ సంరక్షణలో పెరిగాను. 2015లో నా పెంపుడు తల్లి మరణించింది. ఈ ఏడాది మార్చి 20న నా పెంపుడు తండ్రి కూడా మరణించాడు. జయలలిత జీవించి ఉన్నప్పడు నేను తన కుమార్తెను అని ప్రకటిస్తే ఆమె ప్రతిష్ట దెబ్బతింటుంది అని దాచిపెట్టాను అని అమృత పేర్కొన్నారు” సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు కర్ణాటక హైకోర్టులో దాఖలు దాఖలు చేయడానికి అమృత సిద్ధమవుతున్నట్టు సమాచారం.  

jayalalita family  కోసం చిత్ర ఫలితం

“జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచి పెట్టినట్టు”  అమృత అందులో పేర్కొన్నారు” ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

సంబంధిత చిత్రం

జయలలిత స్నేహితురాలు గీత ఇప్పటికే అమృత జయలలిత బిడ్డే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో శోభన బాబు సైతం ఇదే విషయాన్ని తనతో చెప్పినట్లుగా ఆమె వెల్లడించారు. అయితే జయలలితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా ఒక కథనం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. శోభనబాబుతో తాను సహజీవనం చేస్తున్నా నని, అయితే ఆయన వివాహితుడు కావడం వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979 లోనే జయలలిత అంగీకరించినట్లు తెలుస్తోంది.

jayalalita family  కోసం చిత్ర ఫలితం

ఈ మేరకు “స్టార్ అండ్ స్టైల్” అనే ఆంగ్ల సినీ పత్రికకు అప్పట్లో జయలలితే స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు జయలలితకు కూతురు ఉన్నమాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

jayalalita sobhan amruta కోసం చిత్ర ఫలితం

ఈ సంఘటనతో అమృత వ్యవహారానికి బలం చేకూరింది.  దివంగత సినీనటుడు శోభన్‌బాబు, జయలలిత దాంపత్య ఫలితం గానే తాను జన్మించానని అమృత చెబుతున్న నేపథ్యంలో “జయ శోభన్” మధ్య బంధం మరోసారి చర్చనీయాంశ మైంది.

jayalalita family  కోసం చిత్ర ఫలితం

అంతేకాకుండా జయ ఎంజీఆర్ మధ్య ఉండే సన్నిహిత సంబంధలు తెరపైకి వచ్చాయి. జయలలిత సినీ కెరీర్‌ను పరిశీలిస్తే ఎంజీఆర్‌తో కలిసి 28 చిత్రాల్లో నటించింది. ఎంజీఆర్, జయలలిత జంటకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. పట్టికాట్టు పొన్నయ్య అనే చిత్రంలో నటించే సమయంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని సినీవర్గాలు చెప్పు కొంటాయి.

jayalalita sobhan babu relationship కోసం చిత్ర ఫలితం

ఆ తర్వాత ఎంజీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ లో జయలలితను ఎంపిక చేయకుండా వేరే వారిని ఎంపిక చేయడం అప్పట్లో సంచలనం గా మారింది. దాంతో జయలలిత మనస్తాపానికి గురై మానసిక క్షోభకు గురైంది.  అలాంటి పరిస్థితు ల్లోనే జయలలిత తల్లి కూడా మరణించారు. దాంతో ఆమె ఒకరకమైన డిప్రెషన్‌ లోకి వెళ్లారని చెప్పుకొంటారు. ఎంజీఆర్‌ కి దూరమైన తర్వాత జయలలిత కు సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఒంటరిగా జీవితాన్ని గడిపారనేది జగమెరిగిన సత్యం. అలాంటి సందర్భంలోనే అందాల నటుడు శోభన బాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనేది సినీవర్గాల వాదన.

jayalalita sobhan amruta కోసం చిత్ర ఫలితం

శోభన్‌బాబుతో ప్రేమ వ్యవహారాన్ని 1975లో ఓ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. దాంతో వార్తకు జయలలిత స్పందించాల్సి వచ్చిందట. శోభన్‌బాబుతో గాఢమైన అనుబంధం ఉంది. ఆ బంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను. తాళి కడితేనే భార్యభర్తల బంధమా? అని జయలలిత సదరు రిపోర్టర్‌ ను ప్రశ్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

jayalalita sobhan babu relationship కోసం చిత్ర ఫలితం

ఆంగ్ల దినపత్రిక జయలలిత, శోభన బాబు సంబంధాన్ని ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూను ఒక తమిళ దినపత్రిక అనువదించి ప్రచురించటంతో మరోసారి ఈ వ్యవహారం నాడు తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కూడా శోభన బాబుతో తన రిలేషన్ పవిత్రమైనది అని చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సదరు తమిళ వార్తా విలేఖరితో భేటీ అయిన జయలలిత “తాళి కడితేనే భార్యభర్తల బంధం అవుతుందా?” అనే నిలదీసినట్టు సమాచారం. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ వార్త వెలువడినా శోభన్‌ బాబును సమర్ధించే వారని చెప్పుకొంటారు.

jayalalita sobhan babu relationship కోసం చిత్ర ఫలితం

శోభన్‌బాబు వివాహితుడు. ఆయన భార్యకు విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకోవడం తప్పు. వేరొక మహిళ దాంపత్య జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని జయలలిత స్పష్టం చేసేదట. ఇలాంటి సంఘటనలు జయ, శోభన్‌ బాబు రహస్య బంధానికి బలం చేకూర్చాయి.


శోభన్‌బాబుతో సంబంధాన్ని జయలలిత 1979 లోనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి ధృవీకరించారు. శోభన్‌బాబు, జయలలిత మధ్య సంబంధముండేదని, అయితే శోభన్‌ బాబు తన భార్యకు ద్రోహం చేయొద్దనుకోవడంతోనే వీరి ప్రేమ పెళ్లివరకు రాలేదన్నారు.

jayalalita sobhan babu relationship కోసం చిత్ర ఫలితం

శోభన్‌‌ తో సన్నిహిత బంధం పోయెస్‌ గార్డెన్‌లో శోభన్‌బాబుకు జయలలిత భోజనం వడ్డించే ఫొటోలు, వారు అన్యోన్యం గా ఉన్న ఫొటోలతో వారి మధ్య స్నేహం కంటే బలమైన రిలేషన్ ఉందని  “మురసోలి”  అనే పత్రికద్వారా తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి రాజకీయవైరంతో ప్రచురించటంతో అందరికీ అర్ధమైంది.

jayalalita sobhan babu cinema doctor babu కోసం చిత్ర ఫలితం

ఆ నేపథ్యంలో శోభన్‌బాబుతో బంధం గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. జయలలిత సీఎంగా మారిన తర్వాత అలాంటి వార్తలకు కాలం చెల్లింది. మరోసారి వార్తల్లో  జయలలిత మరణం నేపథ్యంలో కూడా ఇలాంటి వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది మీడియా.  శోభన్‌బాబుతో అనుబంధాన్ని మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

సంబంధిత చిత్రం

2017లో కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను శోభన్‌బాబు, జయలలిత దాంపత్యానికి పలితంగా పుట్టానని చెప్పడం సంచలనం రేపింది. తాజాగా అమృత వ్యవహారంలో మరోసారి జయలలిత జీవితం sవార్తల్లోకి ఎక్కింది. తాను జయలలిత కూతురునని చెప్పుకొం టున్న అమృత వ్యవహారం ఎక్కడికి వెళ్తుందనే విషయానికి కాలమే సమాధానం చెబుతుంది.

jayalalita family  కోసం చిత్ర ఫలితం


అమృత నేపధ్యంలో శశికళ ఉందా? ఉండి నడిపిస్తుందా? 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన అమృత వెనక శశికళ ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తుంది. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించడానికి అమృత సిద్ధమౌతుంది. సుప్రీంలో అమృత పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు మద్దతుగా ఆమె బంధువులు లలిత, రంజనీ సంతకాలు చేశారు.


జైల్లో శశికళను రంజని కలుసుకున్న విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యా లను బహిర్గతం చేయాలని రంజనీకి శశికళ చెప్పినట్లు తెలుస్తోంది. జయకు స్వయానా కూతురని అమృత  నిరూపించు కుంటే, ఆ తరువాత పార్టీ, ఆస్తులను చేజిక్కించుకోవచ్చని శశికళ పథకంగా ఆమె సన్నిహితులే చెబుతున్నారు.


jayalalita mother sandhya కోసం చిత్ర ఫలితం

జయలలిత తల్లి సంధ్య:


జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజనీతో కూడా శశికళకు ముందుగానే పరిచయం ఉంది. 1980లో జయలలిత ప్రసవించినపుడు రంజనీ అక్కడే ఉన్నట్లు లలిత చెప్పిందని సమాచారం. జయలలిత తొలి వర్ధంతి సందర్భంగా మంగళ వారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి అన్నాసలై నుంచి అమ్మ సమాధి ఉన్న మెరీనా బీచ్‌ వరకు మౌనంగా ఊరేగింపు జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: