తెలంగాణ పీసీసీ స్థానం మరోసారి ఉత్తమ్ కుమార్ కు వరించనుంది అనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుర్చీ  అధిరోహించిన వెంటనే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి పేర్లు ప్రకటిస్తారట. మొదటిగా ప్రకటించే రాష్ట్రం పేరు తెలంగాణా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ లో  కాంగ్రెస్ లో ఉన్న నాయకులలో  ఉత్తమ్ కుమార్ రెడ్డి వివాద రహితుడాన్ని మరియు పార్టీ ప్రతికూల పరిస్థితులలో కూడా ఆత్మ స్తైరంతో పార్టీ ని ముందుకు నడిపింగలగడాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్హాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఎన్నుకున్నారాన్నికాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉంటాయి.

కాంగ్రెస్ ని ఎప్పటినుండో మోస్తున్న రెడ్డి వర్గాన్ని బుజ్జగించడం కోసం అప్పట్లోనే ఈ  ఎంపిక జరిగిందని కూడా బయట వినిపిస్తున్నమాట. రెడ్డి సామాజిక వర్గం ఉంటే  ఇతర వర్గాలు ఎలాగైనా వస్తాయీ అనే కోణంలో కాంగ్రెస్ ఆలోచిస్తోంది.

ఈ మధ్యే పార్టీలో జాయిన్ అయిన రేవంత్ రెడ్డి రాబోయే రోజులో పార్టీ ప్రచారానికి పనికివస్తాడని అనుకుంటున్న కాంగ్రెస్ హై కమాండ్ రేవెంత్ కి కూడా అప్పుడే ఒక  మంచి పదవి సిద్దం చేసిందట. ఉత్తమ కుమార్ - రేవంత్ ల ఇద్దరి నాయకత్వం లో తెలంగాణా లో ఫుల్ జోష్ లో సాగాలి అనేది సోనియా - రాహుల్ గాంధీ ల సమాలోచన గా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: