జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో  తన పంథా ఎలా ఉండబోతున్నది అనేది  విశాఖపట్నంలో తాజాగా  బయటపెట్టేశారు. రాష్ట్ర ప్రతిపక్షనేత  జగన్ ను  టార్గెట్ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు పవర్ స్టార్. మొదట్లో పరోక్షంగా విమర్శలు ఉన్న కాసేపటికి ఫుల్ టర్న్ తీసుకుని విమర్శలు నేరుగానే జగన్ కు గురిపెట్టాడు. ఈ సందర్భంగా వైజాగ్ లో  డీసీఐ ఉద్యోగులకు మద్దతు పలుకుతూ.

కాబోయే సీఎం నేనే అని అరవడం తనకేమీ సంతోషం ఇవ్వడం లేదు అన్నారు ఆయన. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తాననడం తనకి  తెలియదని చెప్పుకొచ్చారు. ఇలా డైరెక్ట్ గా  వైయస్ఆర్సీపీని, జగన్ ను  తన ప్రసంగంలో విమర్శించారు. తర్వాత ఉత్తరాంధ్రలో జనసేన కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు జగన్ పేరు ప్రస్తావిస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి అవ్వాలని  కోరుకోవడం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదన్నారు. ఈ క్రమంలో నేతల కొడుకులు సీఎంలు కాకూడదని తాను అనడం లేదన్నారు. కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు దోచుకున్నా ఆర్థిక నేరస్థుడు రాష్ట్రాన్నికి  ముఖ్యమంత్రి అంటే అతను చూసి ప్రజలంతా యధారాజా తథా ప్రజా అన్నట్టు తయారవుతారు అనే భయంతోనే జగన్ కు వ్యతిరేకంగా, చంద్రబాబు కి మద్దతు ఇచ్చా అన్నారు.

నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదని అందుకే పాదయాత్ర చేయలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాని ప్రజా సమస్యల కోసం యాత్ర చేస్తానని అన్నారు. తనకు జగన్ తో  శత్రుత్వం లేదని అంటూనే జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం కనిపించింది. వారసులు ప్రతిభని పవన్  మాట్లాడుతుండగా సభలో ఉన్న జనమంతా లోకేష్ సంగతి ఏమిటి అని ప్రశ్నించడం విశేషం. అయితే సీఎం చంద్రబాబు తన కొడుకు విషయంలో ఏదో ఎబిలిటీ చూసే ఉంటారని అందుకే మంత్రిని చేసి ఉంటారని పవన్ అనడం గమనార్హం. పవన్ కళ్యాణ్ మీద ఈ మాటల తరవాత ఇంటర్నెట్ లో విపరీతమైన నెగెటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి . జగన్ మోహన్ రెడ్డి కి ఎలాంటి అనుభవం లేదు కాబాట్టి సీఎం చెయ్యద్దు అంటున్న పవర్ స్టార్ గారు అప్పట్లో ఏం అనుభవం ఉంది అని తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ని గెలిపించమని అడిగారు సారూ? 


మరింత సమాచారం తెలుసుకోండి: