జనసేన అధినేత అయిన  పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)  ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనకు మద్దతు కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పర్యటన పై ఫిలిం క్రిటిక్ కత్తి  మహేష్ తాజాగా ఒక  ఇంటర్వ్యూలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్ సినిమా త్వరలోనే విడుదల ఉంది. కాబట్టి ‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు లాగా అటు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది అనీ అందుకే పవర్ స్టార్ వైజాగ్ చేరుకున్నారు అంటూ ఎద్దేవా చేసారు.

ఉన్న తక్కువ సమయంలోనే రాజకీయంగానూ, సినిమా పరంగాను పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ జనం లోకి వెళ్లాడని దీని వల్ల రెండు రకాలుగా లబ్ది పొందుతున్నడు అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

దీని మీద పవన్ ఫాన్స్ మళ్ళీ గుస్సా అవుతున్నారు. ఇప్పటి వరకూ నిజానికి పవన్ తన ఏ సినిమాకీ అవసరం మేరకు ప్రమోషన్ అనేది చెసుకున్న పాపాన పోలేదు. రెండు మూడేళ్ళు గా ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేసుకుని ఉన్నా కూడా ఎప్పుడూ సినిమా ప్రస్తావన తీసుకుని రాలేదు.

అయితే నిజంగానే వైజాగ్ లోని డీసీఐ ఉద్యోగుల సమస్యల మీద వెళ్ళడా లేక చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయ్యాడా అనేది పక్కన పెడితే పవర్ స్టార్ ఇప్పుడు జనం లో కి వెళ్ళడం సినిమా కోసం మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కత్తి మహేష్ మూర్ఖపు మాటలు పవన్ పట్ల తగ్గించుకుని లాజికల్ గా మాట్లాడితే అందరూ సపోర్ట్ చేస్తారు అతన్ని. 


మరింత సమాచారం తెలుసుకోండి: