పవన్ కళ్యాణ్ మీరు రాజకీయాల్లోకి వస్తునారా? ఇప్పటికీ వచ్చేశారా? వస్తే మీకోసం మీరు ప్రశ్నించటం సమాధానం రాబట్టటం కోసం అనేక విషయాలు పెండింగులో ఉన్నాయంటున్నారు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు. ఒక సారి కనిపిస్తారు. ఏవో విషయాలపై మీకు తోచినట్లు స్పందిస్తారు. మరల మాయమై పోతారు. మీకు సమస్యల పట్ల అవగాహన ఉండవచ్చు కాని పరిష్కారానికి ఫాలో అప్ కావాలి అంటే రాజకీయాలు పార్ట్-టైం కాకూడదు. అది నిరంతర ప్రక్రియ. పార్టీ కోసం ప‌ని చేయ‌నున్న వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న త‌న‌దైన సందేశాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎప్పుడూ లేని విధంగా ఆయ‌న అంద‌రిపైనా విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు.

pavan vizag meeting కోసం చిత్ర ఫలితం

ఏ ఎఒక్క‌రినిఅ ఒక్క పార్టీని వ‌దిలి పెట్ట‌కుండా అంద‌రిని క‌లిపి ఒక్క సారి వేసేసుకున్నారు. ప్ర‌ధాని మోడీ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ  ముఖ్య‌ మంత్రి కేసీఆర్, ప్రతిపక్ష కాంగ్రెస్, వైరి పక్ష వైసిపి ప్రత్యేకించి జగన్ వ‌ర‌కూ ఆయ‌న ఏ ఒక్క‌రినీ వదిలిపెట్ట‌లేదు. త్వ‌ర‌లో తాను రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటాన‌ని చెప్పిన ప‌వ‌న్‌, త‌న తన వ్యాఖ్య‌ల ద్వారా భవిష్యత్ తో విమర్శల హోరు-జోరును మోతాదును మ‌రింత పెంచ‌నున్నన్నట్లు అర్ధమౌతుంది. కాని ఆ భవిష్యత్ ఎప్పుడు? ఈ మీటింగ్ చర్చిన విషయం దాని తరవాత ఆయన చర్య -ప్రతిచర్య ఎప్పుడు? అనేది పెద్ద ప్రశ్న. ఏదో ఒకటి రెండు రోజుల్లో మీడియాలో గోలే కదా! ఆ పై ధారుణ నిశ్శబ్ధం. ప్రజలు నమ్మేదెలా? 

pavan vizag meeting కోసం చిత్ర ఫలితం

తన మిత్ర పక్షం ప్ర‌ధాని మోడీ సారధ్యం లోని బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే కాద‌ని, బీజేపీ కూడా త‌ప్పు చేసింద‌ని, ఆ విష‌యం త‌న‌కు తెలుస‌న్నారు. ఇది ప్రజలకు కూడా తెలుసు. దానీపి ఈ నాలుగేళ్ళు పవన్ కళ్యాన్ ఏమి చేశారు.  మ‌రో సారి మోడీపై విమ‌ర్శ‌ను సంధించారు. తాను విమ‌ర్శ‌లు చేస్తే కేసులు పెడ‌ తార‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని, "న‌న్నేం పీక్కుంటారంటూ ఆవేశంతో వ్యాఖ్యానించ‌ట‌మే కాదు, అవ‌స‌ర‌మైతే ర‌క్తం వ‌చ్చేలా కొట్టించుకోవ‌టంతో పాటు, జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధ‌మ‌ని చెప్పారు. తాను ఏ పార్టీని ఏ ప్రభుత్వాన్ని ఏమీ అడగను అంటూ తెగేసి చెప్పాడు"  పవన్. అంతేకాదు తాను పదవుల కోసం ప్రాపకాల కోసం లాబీయింగ్ చేయను అంటూ  "ఏం పీకుతారో, పీకండి! కోడిగుడ్డు మీద ఈకలు పీకితే, నేను ఏది పీకాలో అదే పీకుతాను" అంటూ రాష్ట్ర కేంద్రప్రభుత్వాలకు హెచ్చ రించాడు పవన్ కళ్యాణ్. ఈ పాయింట్ లో సమాధానం అవసరమే లేదు ఎందు కంటే ఏ ప్రభుత్వమూ ఆయన్ని అరష్ట్ చేయి స్తామని చెప్పలేదు. బహుశ ఏదో రెండు రోజులు వగేసి పోయేవాడితో ఎందుకులే అనుకొని ఉంటారు. ఏమీ చెయ్యలేని ప్రశ్నించలేని తానెందుకు మీటింగ్ పెట్టినట్లు. వాతావరణ, శబ్ధ, ట్రాఫిక్ కాలుష్యాన్ని సృష్టించటానికా?

pavan vizag meeting కోసం చిత్ర ఫలితం

చంద్ర‌బాబును ఉద్దేశిస్తూ, పోల‌వ‌రం ప్రాజెక్టులో ఏం అవినీతి జ‌రుగుతుందో నాకు తెలీదా? అంటూ వ్యాఖ్యానించ‌ట‌మే కాదు, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌కుంటే రానున్న ఎన్నిక‌ల వేళకి ఓట్లు అడిగే హ‌క్కును కోల్పోతార‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మిత్రునిగా చంద్రబాబును   మీరు నిలదీశారా?  కలిసి చర్చించి దీనిపై మీరు యుద్ధమే చేయొచ్చు. గడిబిడి చేయటం కాదు.

pavan vizag meeting కోసం చిత్ర ఫలితం
ఒక లక్షా ఇరవై ఆరు కోట్ల రూపాయిలు కొత్తగా చేసిన ఋణానికి ప్రజలనుండి చంద్రబాబు ప్రభుత్వంపై "అకౌటబిలిటి" ఏమిటని అడగవచ్చు. అసలు మీరు "అజ్ఞాతవాని" నుండి వచ్చేశారు. మీరు చేసిన హోం-వర్కు ఏది? నిలదీయ టానికి ఫాలో-అప్, పారాఫెర్నాలియా ఉండాలి. అవే లేకుండా మీరు మీ అభిమానుల మద్యలో మాట్లాడి కేకలు వేసి పోతే ప్రజలు నవ్వుకుంటున్నారు అసలు నమ్మట్లేదు. మీ సమావేశం మాకు తప్పని తద్దెనం అనుకుంటున్నారు. మీరు రాజకీయాల్లోకి రావాలంటే సీరియస్-నెస్ చూపించండి. 

pavan vizag meeting కోసం చిత్ర ఫలితం

జ‌గ‌న్ ను ఉద్దేశించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర‌లు చేస్తే సీఎంలు అయిపోతారా? అని ప్ర‌శ్నించారు. ఈ మాట అన్న ప‌వ‌న్‌, మ‌రోవైపు తాను అవ‌స‌ర‌మైతే పాద‌యాత్ర‌,  బ‌స్సు యాత్ర‌, ఏ యాత్ర‌కు సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. పవన్ అలా చేస్తే ప్రజలు ట్టించుకోవటమే మానేస్తారట. 


తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీరియ‌స్ వ్యాఖ్య ఒక‌టి చేశారు. అవినీతి విష‌యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జ‌రుగుతున్న‌ది త‌న‌కు తెలుస‌ని, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్రోళ్లు అంటూ మాట్లాడిన వారే, తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌కు ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కు ఇవ్వ‌ట‌మేమిటి? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. సరే ఇదంతా జగమెరిగిన సత్యం.
pavan vizag meeting కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్ మీరు ప్రవచించినట్లు తుడిచిపెట్తుకు పోయింది తెలుగుదేశం పార్టీ రక్షించబడింది. మరి మీ గోలేంటి? అంటున్నారు జనం. 


సాధారణ ప్రజల్లో మీరొకరులా మాట్లాడటం మీకు శ్రేయొదాయకం కాదు. వాటిపై మీరు ప్రశ్నించండి నిగ్గదీయండి కేసిఆర్లా ఉద్యమం లేవదీయండి ఏదీ చేయలేని మీరు "ఒక మూడుగంటల సినిమా విశాఖ రోడ్ల చూపించటమెందుకు" మీ మీటింగ్ అవగానే అక్కడ పొగైన చెత్త మునిసిపాలిటీ వాళ్ళు ఊడ్చేస్తారు. మళ్ళా మీరెప్పుడు వస్తారో అని ఎదురుచూస్తుంటారు  అక్కడ నుండి వెళ్ళిపోయిన మీ అభిమానులు అఙ్జానతవాసి విడుదల కోసం ఎదురు చూస్తుంటారు. శబ్ద దృశ్య కాలుష్యం క్రమంగా కనుమరు గౌతుంది. ట్రాఫిక్ క్లియరై మేము మా గమ్యాలు చేరుకుంటాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: