భారత దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి.  రోడ్డు రవాణా సంస్థలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా..కొద్ది మంది నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇలాంటి ప్రమాదాల్లో అమాయకులు చనిపోవడం..వారి కుటుంబాలు వీధిన పడటం జరుగుతున్నాయి.  తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్ట్ వ్యాన్ ను లారీ ఢీకొనడంతో.. పది మంది మృతి చెందారు.మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

నాగర్‌కోయిల్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోర్‌వెల్‌ వాహనాన్ని డ్రైవర్‌ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.   ఈ  ప్రమాదంలో వ్యాన్‌ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. వీరంగా నాగర్ కోయిల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. తిరుచ్చి ఎస్పీ పీఎస్సీ కల్యాణ్‌ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: