తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో అగ్ర హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన విజయశాంతి..గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన తర్వాత విజయశాంతి మొదట బిజెపిలో చేరి ఆ తర్వాత తెలంగాణ పోరాట సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు.  ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన విజయశాంతి కొంత కాలం ఎంపిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 
Image result for vijayashanthi
ఆ మద్య చెన్నై టీనగర్‌లోని రెండంతస్తుల స్థలాన్ని పవర్ ఏంజెంట్‌గా ఉన్న విజయశాంతి తనకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుని రూ.4.68 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ తర్వాత  ఆ స్థలాన్ని వేరే వారికి విక్రయించారని, తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదంటూ ఐదేళ్ల కిందట ఇందర్ చంద్ జైన్ జార్జిటౌన్ కోర్టులో కేసు వేశారు.  సివిల్ వివాదాలకు సంబంధించిన పిటిషన్‌ను స్వీకరించలేమని కోర్టు పేర్కొనడంతో ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.అదే సమయంలో ఎగ్మూరులోని కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

అంతే కాదు విజయశాంతి సహా నలుగురిపై మోసం కేసుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను సవాలు చేస్తూ విజయశాంతి హైకోర్టుకెక్కారు. బుధవారం ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తుది తీర్పు ప్రకటించింది. వ్యక్తిగత కక్షలతో పిటిషన్లు వేయరాదని జైన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ..విజయశాంతిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: