జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ ప్రతి విమర్శలు చేయడం  షురూ చేసింది.ఇలాంటి సందర్భాలలో ముందుండే నాయకురాలైన ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా జనసేన నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం అన్న పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలా  అనే హక్కు పవన్ కళ్యాణ్ కు  లేదన్నారు.

తన అన్న  చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండేవాడని రోజా ప్రశ్నించారు. అప్పట్లో ప్రత్యేక హోదా గురుంచి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అ అంశం గురించి నోరు మెదపడే అంటూ ప్రశించారు.

మాట్లాడాలని ఈ క్రమంలో డిమాండ్ చేసారు రోజా. పనిలో పనిగా జబర్దస్త్ హీరోయిన్ లేక సభలో బోర్ కొడుతోంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన తే దే పా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చేసారు.

అయితే ఇక్కడ రోజా మిస్ ఐన పాయింట్ ఏంటి అంటే రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయనాయకుడు అవ్వడానికి ఒక హీరో కొడుకు లేదా తమ్ముడు హీరోకి వారసుడు అవ్వడానికి చాలా తేడా ఉంది. హీరో తమ్ముడో , కొడుకో హీరో అయితే మహా అయితే మొదటి రెండు సినిమాలకీ జనాలకి టికెట్ నష్టం తప్ప మళ్ళీ ఆ హీరో మొఖం చూడరు. ఇక్కడ రాజకీయాల్లో అలా కాదు సారూ .. ఒక్కసారి పెద్ద రాజకీయనాయకుడిని నమ్మి చిన్నోడిని గెలిపిస్తే తేడా వచ్చిందంటే  ఐదేళ్ళ పాటు నరకం చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: