ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే అధికార మిత్రపక్షాలు అయినా తెదేపా, భాజాపా ల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు, పోలవరం వెలిగించిన్న మంటలు, రెండు పార్టీ లు రాబోయే రోజులలో కట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని అదునుగా  వైసీపీ భావిస్తోందా? అనే కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అదే జరిగితే భాజాపా తో దోస్తీ అవ్వడానికి వైసీపీ రెడి అయినట్లుగా బావించవచ్చా? ఇటువంటి ప్రశ్నలకు అవును అనే సమాధానాలు ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతున్నాయి.   దీనికి తాజాగా సాక్షి ఇంటర్వ్యూలో వైసీపీ అధ్యక్షుడు జగన్ బిజెపి పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలు  నిదర్శనం గా చెప్తున్నారు.అయితే జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ని గమనిస్తే గతం లో మీరు బిజెపి తో కలుస్తారని చాల మంది అన్నారని ప్రశ్న అడగగా అదంతా చంద్రబాబు అండ్ కో ప్రచారం అని కోటి పారేశారు.

ఈ క్రమంలో భాజాపా తో తమ దోస్తీ ఉండబోదని చెప్పలేదు. పైగా మోడీ తో కలిసి నడుస్తామని స్పష్టంగా చెప్పారు. అయితే ప్రత్యేక హోదా కు అంగీకరిస్తేనే సుమా అంటూ మెలిక పెట్టారు. ఈ విషయం తాను ప్రధానమంత్రి మోడీకే చెప్పానన్నారు. ఈ క్రమంలో వైయస్ఆర్సిపి బిజెపి పార్టీ తో దోస్తీ  కంటే వాతావరణం కనబడుతోందని రాజకీయవర్గాలంటున్నాయి.

ఈ సందర్భంగా జగన్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ కేంద్రం అంటే చంద్రబాబు బయపడుతునరాన్ని అందుకే వారితో తెగదెంపులు చేసుకోవట్లేదని వ్యాఖ్యలు చేసారు .ఎన్నికల కు ఒక నెలలు, ఆరు నెలలు ఉండగా అది జరగవచ్చు అన్నారు.  జగన్ వ్యాఖ్యలు బట్టి చూస్తే భాజాపా-తెదేపా ల దోస్తీ కటీఫ్  కావడం ఖాయం అని వైసీపీ ఆశాభావం తో ఉందనేది విశ్లేషకుల అంచనా. 


మరింత సమాచారం తెలుసుకోండి: