ఉన్నత విద్యను అభ్యసించి బంగారు భవిష్యత్ కి బాటలు వేసుకోవాలని ప్రతి విద్యార్థి..వారి తల్లిదండ్రులు భావిస్తారు.  కానీ ఈ మద్య కొన్ని ప్రైవేటు కళాశాలల పనితీరు తో విద్యార్థులు విద్య అందకారంలో పడిపోతుంది.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో  ఫాతిమా వైద్య కళాశాల విషయంలో ఇదే జరిగింది.  తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు.

‘ఒక దేశం సంపద ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత.   ఇటు బాసర ఐఐఐటీ, ఉస్మానియా విద్యార్థులు, అటు విజయవాడలోని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి జనసేన తన వంతు ప్రయత్నం చేస్తుందని హామీ ఇస్తున్నా. యువతను జాగృత పరిచేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నా. బలిదానాలు బాధాకరం.అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయన్ని కలిశారు. తమ ఆవేదనను పవన్ ముందు వ్యక్తం చేశారు. ఫాతిమా కళాశాలపై చర్యల విషయంలో ప్రభుత్వం వెనుకాడుతోందని, ఆరు నెలలుగా రోడ్లపై తిరుగుతున్నామని వాపోయారు. మరో నెల రోజుల్లో పరీక్షలు ఉన్న సమయంలో తమ ప్రవేశాలు రద్దు చేశారని చెప్పారు. తాము సీట్లు మాత్రమే అడుగుతున్నామని, ఫీజులు కాదని అన్నారు. కళాశాల యాజామాన్యం తమను మోసం చేసిందని, అందరిచుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫాతిమా కళాశాలకు తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమని, మంత్రి కామినేని తమకు సరైన సమాధానం ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. కాగా, పెన్షన్ స్కీం ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా తమ సమస్యలను పవన్ కల్యాణ్ కు విన్నవించారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల ఆవేదన చూసి పవన్ కళ్యాన్ చలించి పోయారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: