ప్రతిపక్ష నాయకుడైన జగన్ ను టార్గెట్ చేస్తూ జనసేన పర్యటన సాగుతుంది. ఈ నేపథ్యంలో సమస్య ఎక్కడ ఉన్నా సమస్య బారిన పడిన ప్రజల బాధను వింటున్నారు అలాగే అండగా ఉంటానని  పవన్ కళ్యాణ్  భరోసా ఇస్తున్నాడు. ఈ క్రమంలోవిశాఖపట్నం, పోలవరం తర్వాత పవన్ కళ్యాణ్ బెజవాడ చేరుకున్నారు. ఈ సందర్భంలో ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ సమస్యను కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యలకు విద్యార్థి నాయకుడి వలె పోరాడడానికి అయినా వెనుకాడబోనని వారికి స్పష్టం చేశారు. అలాగే మీ సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత  విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు విని చలించిపోయారు... వారి జీతం 6000 తో గడపాల్సి వస్తుంది అని విషయం  తెలుసుకున్ని బాధపడ్డారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైయస్ఆర్సీపీ పార్టీని విమర్శించారు. ఇంత మంది ఉద్యోగులు సమస్యలు అనుభవిస్తుంటే చర్చించాల్సింది టీవీ ముందు కాదని అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. ప్రతిపక్షం అలా చేయకుండా రోడ్లపై తిరగడం ఏంటని జగన్ పాదయత్రని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు తన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే జగన్ సరిగ్గా పాదయాత్ర చెయ్యడానికి ముందరే వీరిని కలుస్కోవాలని అనుకున్నారు కానీ పాదయాత్ర మొదలైపోయింది.

సో నెమ్మదిగా కలుద్దాం అనుకున్న టైం లో పవన్ రంగం లోకి దిగి .. వైకాపా కంటే ముందరే పోలవరం కవర్ చేసి విజయవాడ లో స్టూడెంట్ లని కవర్ చేసి ఒంగోలు లో కృష్ణా నది వరద బాదితులని కవర్ చేసేస్తున్నారు. జగన్ పాదయాత్ర మొదలైన వెంటనే జనసేన లో పుట్టిన కొత్త ఆలోచనగా ఇది కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: