వియన్నాలో జరిగిన రెండురోజుల ప్లీనరి సమావేశం లో "వాస్సెనార్ ఏర్పాట్లు" అనబడే 41 సభ్యదేశాల సభలో 42వ దేశంగా చేరిపోయింది. దీంతో అణు సరపరా దేశాల సంఘటనలో మనం చేరలేకపోయామన్న భావన కొంతవరకు తొలిగి పోతుంది.  చైనా తప్ప ఐఖ్య రాజ్య సమితి,  భద్రతా మండలి సభ్య దేశాలన్నీ "వాస్సెనార్ అరెంజ్మెంట్- డబ్లు.ఏ" లో సభ్యులే. 

wassenaar arrangement కోసం చిత్ర ఫలితం

సంప్రదాయ ఆయుధాలు, ద్వివిధ-వినియోగ ఆయుధాల సాంకేతిక సహకారం పొందటం(డ్యుయల్ - యూజ్ టెక్నాలజీ) ఇచ్చిపుచ్చు కోవడం ఈ అంతర్జాతీయ సంఘట్టన  ఒక క్రమ పద్దతిలో నియంత్రిస్తుంది. భారత సభ్యత్వానికి గ్రూపులోని మిగతా 41 దేశాలన్నీ సంపూర్ణ మద్దతు ఇచ్చాయని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. 2016 జూన్ లో 'క్షిపణి సాంకేతిక నియంత్రణ' ను (మిసైల్ టెక్నాలజీ రెగ్యులేటర్) నియంత్రించే "ఎంటీసీఆర్‌" లోనూ భారత్ సభ్యత్వం పొందింది. మరి కొద్ది నెల ల్లోనే భారత్ వాసెనార్ అరేంజ్‌మెంట్‌ లో అధికారికంగా ప్రకటించబడుతుంది. దీనివల్ల అత్యున్నత స్థాయి టెక్నాలజీని పంచుకునే విషయంలో ఒప్పందాలు చేసుకునే టందుకు వీలవుతుంది. రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన కార్యక్రమాల్లో టెక్నాలజీని పొందడంలో భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. 

wassenaar arrangement  కోసం చిత్ర ఫలితం
అత్యున్నత సాంకేతిక, డ్యుయల్-యూజ్ ఆయుధ ఎగుమతుల లైసెన్సుల కోసం భారత్ దరఖాస్తు చేయడం ఇక మరింత తేలిక కానుంది. భారత్, అమెరికా మధ్య అణు ఒప్పందం కుదిరిన తర్వాత మన దేశం నాలుగు అణ్వస్త్ర రహిత గ్రూపుల్లో (నాన్ ప్రొలిఫిరేషన్) చేరింది. వీటిలో మూడు గ్రూపుల్లో చైనాకు సభ్యత్వం లేదు. "మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీం (ఎంటీసీఆర్)‌ లో సభ్యత్వానికి చైనా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆ దేశానికి సభ్యత్వం దక్కలేదు.
MTCR కోసం చిత్ర ఫలితం
కానీ "ఎంటీసీఆర్‌" లో భారత్ చేరేందుకు 31 దేశాలు సమ్మతించాయి. ఎంటీసీఆర్, వాసెనార్‌ సభ్యదేశాల్లో చాలా దేశాలకు "ఎన్‌.ఎస్.జి." లోనూ సభ్యత్వం ఉంది. దీంతో ఈ గ్రూపుల్లో చేరడం ద్వారా చైనాకు భారత్ చెక్ పెట్టినట్లయ్యింది. 'న్యూక్లియర్ సఫ్లయర్స్ గ్రూప్‌' లో భారత సభ్యత్వానికి పలువిధాల అడ్డుపడుతున్న చైనాకు ఈ దెబ్బతో దిమ్మతిరిగింది. ఇది చైనాకు మామూలు షాక్ కాదు. "వాసెనార్ అరేంజ్‌మెంట్‌" లో భారత్ 42వ సభ్యదేశంగా చేరటంతో భారత్ కు ఎన్.ఎస్.జిలో సభ్యత్వం లేదన్న ఫీలింగ్ కు అంతగా విలువలేనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: