భారత దేశంలో  2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు.
Image result for sonia gandhi rahul gandi
త్వరలో ఆ బాధ్యతలు ఆమె తనయుడు రాహుల్ గాంధీకి అప్పగించబోతున్నట్లు ఈ మద్య వార్తలు వస్తూనే ఉన్నాయి.  నేడు సోనియాగాంధీ పుట్టిన రోజు ఈ సందర్భంగా భారత ప్రభాని నరేంద్ర మోదీ ఆమెకు  ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఈ విషెస్ చెప్పారు.  'కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.
Image result for gujarat elections
ఆమెకు మంచి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని వేడుకుంటున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు. 1946, డిసెంబ‌ర్ 9న సోనియాగాంధీ జ‌న్మించారు. ప్రస్తుతం గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే..ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ ల మద్య భారీ స్థాయిలో పోటీ నెలకొంది. గెలుపు ఇరు పక్షాల నాయకులు మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: