రీసెంట్ గా మూడు రోజుల సుడిగాలి పర్యటన అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ మొత్తం కలయ తిరుగుతున్నాడు. తన వర్తమానం గురించి తప్ప తన గతం గురించి ఎవరూ అడగక పోయినా ఎత్తి మరీ వివరిస్తున్న జనసేన అధినేత రీసెంట్ గా అల్లూ అరవింద్ గురించి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.


పీఆర్పీ విషయం ప్రస్తావిస్తూ ఒకరోజు పరకాల ప్రభాకర్ నీ మరొక రోజు అల్లూ అరవింద్ విషయాన్నీ ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అల్లూ అరవింద్ ఒకప్పుడు అలా చెయ్యకుండా ఉంటె బాగుండేది అన్నట్టు మాట్లాడాడు.


తొలిసారిగా పవన్ అల్లు అరవింద్ మీద బహిరంగాంగా అసంతృప్తి ని వ్యక్తం చేసారు కళ్యాణ్ . అల్లూ అర్జున్ , రామ్ చరణ్ లనే కొన్ని చోట్ల ప్రచారానికి పంపించి తనని అల్లూ అరవింద్ ఆపెసేవాడు అనీ తనకి ఉన్న సామాజిక స్పృహ గురించి అప్పట్లో అల్లూ అరవింద్ అర్ధం చేసుకోలేదు అన్నట్టు కళ్యాణ్ చెప్పాడు. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ చేసిన వ్యాఖ్యలకి అల్లూ అరవింద్ తీవ్రంగా కలత చెందారట.


పవర్ స్టార్ ఒకరకంగా ఈ రేంజ్ కి రావడానికి అల్లూ అరవింద్ కూడా కారణం. పవన్ కళ్యాణ్ సినిమాల విషయం లో ఎప్పుడూ అల్లూ అరవింద్ ముందే ఉండేవారు. అలాంటి తనని పవన్ తక్కువ చేసి అది కూడా ఇన్నేళ్ళ తరవాత అయిపోయిన టాపిక్ ఎత్తి మరీ ఇరికిస్తాడా అంటూ బాధపడ్డారట 


మరింత సమాచారం తెలుసుకోండి: