అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు "పోలవరం బహుళార్ధ సాధక పథకం" (ప్రోజెక్ట్)పై శ్వేతపత్రం ప్రకటించ టానికి వెనకాడటం ఎందుకు?  ఇది ప్రతిపక్షం వైరిపక్షం వ్యతిరేఖుల ప్రశ్న మాత్రమే కాదు. సమాధానమిస్తూ ఆ స్వేతపత్రం ప్రకటిస్తే చాలామంది నోళ్ళు మూతపడటం తధ్యం. అలా కాకపోతే, చంద్రబాబు రాజకీయ జీవితంపై, నిప్పులాంటి వ్యక్తిగత జీవితంపై తుదకు ఆంధ్రజన ఆశాదీపం పొలవరంపై పడుతున్న చెరగని పెద్ద మచ్చ. శ్వేతపత్రం పై చంద్రబాబు తీరు అభి మానులను కూడా తీవ్ర నిరాశ పరచే విషయం కూడా!

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

వైట్‌ పేపర్‌ - అచ్చ తెలుగులో తెల్లకాగితం. దీన్ని రాజకీయాల్లో 'శ్వేత పత్రం' ఒక విషయం పై ప్రభుత్వం ప్రజలకు చట్టసంస్థ లకు సమర్పించే నిజాయతీ ఉట్టిపడే సవివర శ్వేతపత్రం అంటుంటారు. అంటే, ఇందులో పేర్కొన్నవన్నీ వాస్తవాలని అర్థం. 2014 ఎన్నికల్లో గెలిచాక, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒకదానితర్వాత ఇంకోటి, వరుసగా పలు 'శ్వేత పత్రాల్ని' విడుదల చేశారు.

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించీ, విద్యుత్‌కి సంబంధించి ఇంకా చాలా చాలా అంశాల గురించి చంద్రబాబు “శ్వేత పత్రాలు” విడు దల చేసిన విషయం విదితమే. అఫ్‌కోర్స్‌, అవి శ్వేతపత్రాలు కాదు 'పచ్చ' పత్రాలనే ప్రతిపక్షం వైరిపక్షం వ్యతిరేఖుల ఆరోపణ లు ఉన్నాయనుకోండి . అది వేరే విషయం. 

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

మళ్ళీ ఇప్పుడు 'శ్వేతపత్రం' డిమాండ్‌ చంద్రబాబు ముందుకొచ్చింది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేత పత్రం కోసం డిమాండ్‌ చేయడం, దాన్ని చంద్రబాబు లైట్‌ తీసుకోవడం మామూలే. కానీ, మిత్రుడు మెగా పవర్ స్టార్, జనసేన సార్వం సహా సార్వభౌముడు తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల భాగస్వామ్య ప్రభుత్వ నిర్మాత  పవన్‌ కళ్యాణ్‌….కూడా తరచి తరచి పోలవరం ప్రాజెక్ట్‌పై 'శ్వేతపత్రం' గురించి అడిగితే, చంద్రబాబు నుంచి స్పందన కాస్తంత సీరియస్‌గా వచ్చింది. “ఎందుకు ఇవ్వాలి” అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేసేశారు పవన్‌కళ్యాణ్‌ మీద  అదీ తన రాజకీయ పునఃజన్మ ప్రధాత మిత్రుడు పవన్ కళ్యాణ్ పై.

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఏ అంశమ్మీదనైనా “శ్వేతపత్రం” డిమాండ్‌ చేయొచ్చు. 'ఎందుకు ఇవ్వాలి' అని ప్రశ్నించిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి బహుశా నారా చంద్ర బాబునాయుడుగారే అవుతారేమో.! అయినా, శ్వేతపత్రం పేరుతో పచ్చ పత్రాల్ని విడుదల చేయడం చంద్రబాబుకి అలవాటే గనుక, చాలా తేలిగ్గానే పవన్‌ డిమాండ్‌కి ఓకే చెప్పేసి వుండాల్సింది. పోలవరం రహస్యమా? ప్రజాస్వామ్యంలో పారదర్శకత (ట్రాన్స్పెరెన్సీ) గురించి పదేపదే మాట్లాడే చంద్ర బాబుకి కోపమొచ్చింది.

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

దానికి కారణం “పోలవరం ప్రాజెక్ట్‌ నా కల, ఆ కలని సాకారం చేసి తీరతా!” అంటూ చంద్రబాబు చేసే హంగామా హడావిడి అంతా ఇంతా కాదు! పని తక్కువ ప్రచారార్భాటమెక్కువ. అక్కడ కేంద్రం నుంచి నిధులు రాకుండా, చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళలేరు. అదీ అసలు సమస్య. గడచిన మూడున్న రేళ్ళలో ఏం జరిగిందో అందరికీ తెల్సిన విషయమే. పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పనులు 51 శాతం పూర్తయిపోయిందని చంద్రబాబు చెబుతున్న విషయం విదితమే. 

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

 అయితే అక్కడ పరిశీలించే జనం, రాజకీయాలతో సంబందం లేని అధికారులు మాత్రం పని 15% నుంచి 25% వరకు కూడా జరగలేదని, చేసిన దుబారా వ్యయం అదుపు తప్పిందని. ట్రాన్స్-ట్రాయి దోపిడీ కూడా లెక్కకు మించిపోయిందని. ఇందులో కాంట్రాక్టర్ బొక్కింది ఎంత, అధికార పార్టీ మెక్కింది ఎంత, అధికారులు మేసింది ఎంత అనేదాంట్లో- ఆ దోపిడీ లెక్కలు తెలే లాగా ఉండవని అంటున్నారు.

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

కేంద్రం అడిగిన లెక్కలు చెప్పనందున, కాగ్ ఆడిట్ లో కనిపించిన అత్యంత ధారుణదోపిడీ చూసిన, కెంద్రం రాష్ట్రం ఖర్చుల లెక్కలు చెప్పక పోతే నిధుల సరపరా నిరవది కంగా ఆపేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ధారుణ  పరిస్థితుల్లో పోల వరంపై "శ్వేతపత్రం" ప్రకటించటం ఎంతైనా రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పార్టీకి శ్రేయొదాయకం అన్నది చంద్రబాబు గమనిస్తే మంచిది. ఇది ఆయన ఇంటి వ్యవహారం మాత్రం కాదు. ప్రజలంతా ముక్తకంఠంతో కోరే “శ్వెతపత్రం” ప్రకటించి ఆ తరవాత కెంద్రం నుండి నిధులు రాకపోతే కేంద్రాన్ని నిందించవచ్చు.

centre state relationship with polavaram కోసం చిత్ర ఫలితం

రాష్ట్రం లో టిడిపి అధికారం లోకి వచ్చిన తరవాత చేసిన ఋణాలకు సృష్టించిన సంపదలకు పొంతన లేకుండా పోయిందని ఆడిట్ వర్గాలు నెత్తీ నోరు బాదుకుంటున్నా రాష్ట్రానికి చీమ కుట్టినట్లు లేకపోవటం కూడా ప్రజల్లో ధారుణమైన నిధుల దుర్విని యోగం జరిగిందనే భావిస్తున్నారు. అసలు కెంద్రం చేయవలసిన పనిని కాంట్రాక్టర్ల నుండి కమీషణ్ల కోసం కేంద్రంపై వత్తిడి చేసి మరీ కేంద్రం నుంచి గుంజుకుని పని చేయించవలసిన అవసరం రాష్ట్రానికేమొచ్చిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

centre state relationship with polavaram కోసం చిత్ర ఫలితం

వైఎస్‌ హయాంలో అసలేమీ జరగలేదన్న చంద్రబాబుమాటలే నిజమనుకుందాం. 51% పనులు గడచిన మూడున్నరేళ్ళలోనే  పూర్తయ్యాయనుకుందాం. ఆ లెక్కన, మిగతా 49%  పనులు పూర్తవడానికి ఇంకో మూడున్నరేళ్ళు ఖచ్చితంగా పడుతుంది కదా! కానీ, 2018 నాటికే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయిపోతుందని చంద్రబాబు 'కథలు' చెబుతున్నారు. అంతే కాకుండా పోలవరం పూర్త య్యాకే ప్రజలవద్దకు వచ్చి ఓట్లు అడుగుతానన్న టిడిపి అధినేత ఇక ప్రజలవద్దకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రజలు నిరాశగా ప్రశ్నిస్తున్నారు. 

centre state relationship with polavaram కోసం చిత్ర ఫలితం

ఇంకో పక్క, పోలవరం ప్రాజెక్ట్‌ కి కేంద్రం 'బ్రేక్‌' వేసింది. దాని కారణమూ లేకపోలేదు. పైన అనుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన నిధులకు, చంద్రబాబు సర్కార్‌ లెక్క చెప్పడం లేదని, ఎంత ఖర్చు చేశారో, ఎంత పక్కదారి పట్టిందో ఎవరికీ తెలియని పరిస్థితి. కేంద్రం పై మొత్తం దేశనుండే వత్తిడి తీసుకు రావాలంటే టిడిపి అధినేత పోలవరం పై ప్రారంభం నుండి ఇప్పటి వరకు గణాంకాలు శ్వేతపత్రం ద్వారా ప్రకటించ టమే సరైన మార్గం. ఇందులో కేంద్రం అడిగిందీ సమంజసమే. దాన్ని ఎవరూ వ్యతిరేకిం చరు కాదనరు.

centre state relationship with polavaram కోసం చిత్ర ఫలితం

శ్వేతపత్రమంటూ విడుదల చేస్తే, అది పచ్చపత్రమైనాసరే, అందులో ఖచ్చితంగా దొంగ లెక్కలు ఉంటే బయటపడిపోతాయి. ఆ లెక్కల్ని కేంద్రం పసిగట్టేసిందా, అంతే సంగతులు. అదీ చంద్రబాబు భయంఅదే!  “వైట్‌-పేపర్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌” అయిన చంద్రబాబు ఆ వైట్‌ పేపర్‌ పేరు చెబితే ఎందుకు వణికిపోతున్నారో?  జనాలకు అర్థమవుతోంది కదా.! చంద్రబాబు ఇంతగా శ్వేతపత్రం ప్రకటించటానికి నిరాసక్తత చూపిస్తున్నారంటే అదే రేంజులో ప్రజల్లోనేకాదు కేంద్రంలోనూ అనుమానాలు పెరిగి పోతుంటాయి "అనులోమానుక్రమం" లో. పోలవరంలో ఏదో మర్మం ఉందనీ, ఆ సందర్భంగా "ఓటుకు నోటు" దగా కూడా గుర్తుచేస్తూ చంద్రబాబు ఎంతకైనా సమర్ధుడని ప్రజలు నమ్మటంలో తప్పేమీలేదు.

centre state relationship with polavaram కోసం చిత్ర ఫలితం

ఇంతటి పెద్ద విషయాన్ని (నేరమంటూ ఉంటూ) బలహీనం చేయటానికి ఇప్పటికే "అంతర్జాలం ద్వారా పెద్దపెద్ద ప్రోజెక్టులు అనుకున్నట్లు పూర్తయిన దాఖలాలు చరిత్ర లో లేవన్నట్లు ఒక కుల సమాజం నిరంతర ప్రచారం ప్రారంభించింది"  అందుకే ఇందులో ఏదో మతలబు, మర్మం, సూక్ష్మ మోసం, దగా జరిగి ఉండొచ్చు. అందుకే ప్రజలు అనుకుంటున్నట్లు చంద్రబాబు ప్రజలని మోసం చేశాడా? అందుకే  నిధులను దారిమళ్ళించలేదని ఋజువు చేసుకోవటం చంద్రబాబుకు చాలా అవసరం. పోలవరం "ప్రోజెక్టులో దాగిన మర్మం - పరమ రహస్యం 'వైట్ పేపర్' ప్రకటిస్తే బట్టబయలౌతుంది"
pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

అది మాత్రం కూడా చేయించలేక పోతే పవన్ కళ్యాణ్ బాబుచేతిలో మోసపోయినట్లే. ఒక సారి ప్రజారాజ్యం పేరుతో ప్రజలని మోసంచేసిన కొణిదెల కుటుంబాన్ని "పొరపాటు"గా భావించినా - ప్రజలు పవన్ కళ్యాణ్ చెప్పేమాటలు కనీసం వింటున్నారు. ఇంకోసారి అలా జరిగితే కొణిదెల కుటుంబానికి మోసపోవటం "అలవాటు" అని ప్రజలను కుంటే వారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఆ కుటుంబానికి గౌరవం భూస్థాపితంతధ్యం. పవన్ తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి ఆ తప్పు జరగనివ్వద్దని మామనవి.  

pavan kalyan & chandrababu polavaram secret & transstroy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: