జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు రాబోయే ఎన్నికల లో యుద్ధం ఎవరి మీద శత్రువు ఎవరో  కొంత క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పై అలాగే భారతీయ జనతా పార్టీ పై అస్త్రాలు ఎలా ఉపయోగించాలో వివరించాడు. అలాగే పోయిన ఎన్నికలలో తాను  మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీకి విషయంలో మాత్రం సరైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ తనకు గెలిచే శక్తి లేకున్నా దెబ్బ కొట్టే శక్తి ఉందని తేల్చేశారు.అయితే పవన్ పొలిటికల్ పంచ్ పడేది మాత్రం జగన్ పార్టీ కె అని రాజకియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టీడీపీకి ప్రత్యామ్నాయం వైకాపా మాత్రమే.

పవన్ నాలుగురోజుల తాజా పర్యటన జగన్ లక్ష్యం చేసుకుంటూ అలాగే జగన్ పార్టీ అయినా వైయస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వర్తించలేదని ప్రజలలో స్పష్టం చేస్తూ సాగడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

మరో ప్రక్క ప్రజా సమస్యల్ని గురించి ప్రస్తావిస్తూ వైసిపి కన్నా ఎటువంటి అధికారం లేని జనసేనే చాలా బాగా ప్రజల సమస్యలని ప్రశ్నించగాలదని  పరిష్కరించగలదని జనసేనాని అండర్ లైన్ చేసిమరీ చెప్పిన పాయింట్. అలాగే తెలుగుదేశం పార్టీకి వైసిపి ప్రత్యామ్నాయం కాదని తామే అని పవన్ చెప్పకనే చెప్పేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల  ఫలితం ఎలా ఉంటుందో తెలియదుగానీ. దానికి ముందు జనసేన పరిణామాలు జగన్ పార్టీకి కొంత ఇబందికరంగా ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: