భారత్ లోని విద్యా సంస్థల్లో వినొద రంగంలో డ్రగ్ బానిసత్వం రోజురోజుకూ పెరిగిపోతుంది. దీనికి ఏ విద్యాసంస్థ ఎక్సెప్షన్ కాకుండా పోతుంది. అయితే ఆందోళన పడవలసిన విషయమేమంటే ప్రపంచ ప్రఖ్యాత ఐఐటి విద్యాసంస్థల్లో మత్తు ప్రభావం నెత్తి కెక్కినట్లు వార్తలు వస్తున్నాయి.


వందలాది మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు, మారుతున్నట్లూ ప్రతిష్ఠాత్మక ఐఐటీ-కాన్పూర్ అంతర్గత విచారణలో తేటతెల్లమయ్యింది. ఈ విచారణలో వెల్లడయిన విషయాలు చూసి అధికారులే విస్తుపోయారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. తమ ఐఐటీ లోని ప్రతిభా వంతులైన విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసగా మారినట్లు వారి యాజమాన్య అంతర్గత విచారణలో వెలుగుచూసిందని, పరిస్థితి కూడా చాలా భయానకంగా మారిందని కాన్పూర్ ఐఐటీ తాత్కాలిక డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వ్యాఖ్యానించారు. 


ఈ విషయంపై జిల్లా మేజిస్ట్రేట్ సురేంద్ర సింగ్‌కు వివరించామని, కొందరు అత్యధికంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వెలుగు చూసిందని అన్నారు. ఇప్పటికే డ్రగ్స్ తీసు కుంటున్నవారిని గుర్తించామని, మరి కొందరిని ఇంకా గుర్తించాల్సి ఉందని మణీందర్ అగర్వాల్ అన్నారు.

iit kanpur manindar agarwal కోసం చిత్ర ఫలితం

ఐఐటీ-కాన్పూర్  ప్రాంగణంలోకి మాదక ద్రవ్యాలను చేరవేయడంలో భద్రతా సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగులు, మరి కొందరు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారని మణీందర్ అగర్వాల్ చెప్పారు. జనవరి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్‌ విద్యార్థు లందరికీ కౌన్సెలింగ్-సెషన్స్ నిర్వహిస్తామన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తామని చెప్పారు. అంతేకాదు వీటిని సరఫరా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థుల కు డ్రగ్స్ సరఫరా చేసేవారిని తక్షణమే గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మణీందర్ అగర్వాల్ తెలియజేశారు. 


విద్యార్థులే లక్ష్యంగా అనేక నార్కోటిక్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయని, వీరిలో పరిసర గ్రామాల్లోని వ్యక్తులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కొన్ని నెలల కిందట మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తోన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారని, ప్రస్తుతం వారి పేర్లను కూడా విద్యార్థులు వెల్లడించారని పేర్కొన్నారు.


ప్రభుత్వాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించక పోతే భవిష్య భారతం ప్రశ్నార్ధకమౌతుందని అంటున్నారు. ఈ మద్య తెలంగాణాలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం చప్పున చల్లబడి పోవటానికి ప్రభుత్వమే కారణమంటున్నారు. ఇలాగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తే దాదాపు దేశమంతా మత్తులో తూలటం ఖాయం.

iit kanpur students in the cluches of drugs కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: